చంద్రన్న ముందు సర్కారు ఉలికింపులు

రాజకీయాల్లో అతితెలివిని ప్రదర్శిస్తే వారిని తెలుగువారు నాటి చరిత్రలో వాసికెక్కిన రాజకీయదురందరుడైన చాణక్యుల వారితో సరిపోలుస్తారు. ఇలా సరిపోల్చడానికి వీలులేని నేటి భారత రాజకీయాల్లో అగ్రతాంబూలం అందుకున్న ఏకైకనేత, తెలుగు వారిని  40ఏళ్లుగా పట్టిపీడిస్తున్న…

రాజకీయాల్లో అతితెలివిని ప్రదర్శిస్తే వారిని తెలుగువారు నాటి చరిత్రలో వాసికెక్కిన రాజకీయదురందరుడైన చాణక్యుల వారితో సరిపోలుస్తారు. ఇలా సరిపోల్చడానికి వీలులేని నేటి భారత రాజకీయాల్లో అగ్రతాంబూలం అందుకున్న ఏకైకనేత, తెలుగు వారిని  40ఏళ్లుగా పట్టిపీడిస్తున్న చంద్రబాబే. బాబు ఎవరికి అంతుపట్టరు. ఆయన్ని ఫాలో అయినవారు అడుగడుగునా ఆయన నడిచే తోవనపడి సాగుతూ అనుక్షణం దారితప్పుతునే ఉంటారు. మళ్లీ వెతుక్కుంటూ ఆయన వెంట నడుస్తుంటారు. ఇదీ చంద్రన్న రాజకీయాల్లో వడివడిగా నడిచేతీరు. ఇక మన కథనంలోకి వెడితే… పిల్లనిచ్చిన మామపై పోటీకి నేను రెడీ. నాకు కాంగ్రెస్సే రాజకీయబిక్ష పెట్టింది ఆపార్టీ కోసం సర్వం వదులుకుంటానని మీడియాకు అప్పట్లో స్పెషల్‌ ఇంటర్య్వూలు ఇచ్చారు. ఇలాంటివారి వలనే కాంగ్రెస్‌కు వందేళ్ల చరిత్ర అప్రతిహాతంగా సాగిందని ఎంతోమంది మేథావులు అనుకున్నారు. తీరా, ఎన్‌టీఆర్‌ ప్రభంజనంలో కాంగ్రెస్‌ ఘోరంగా కొట్టుకుపోయింది. అందులో బాబు కూడా ఘోరఓటమి పాలయ్యారు.

అప్పుడు కాంగ్రెస్‌ ఎందుకు ఓడామని పెట్టుకున్న మీటింగులకు డుమ్మా కొట్టిందెవరయ్యా అంటే అందులో ప్రధములు చంద్రబాబే. ఆతర్వాత బాబు ఎన్‌టీఆర్‌కు చిన్నఅల్లుడైనందున ఆపార్టీలో ప్రవేశం చాలా తేలికగా పావులు కదిపారు. ఎన్‌టీఆర్‌కు పిల్లలంటే ఎనలేని అభిమానం. కుమార్తె భువనేశ్వరి తన భర్త చంద్రబాబును పార్టీలో చేర్చుకోండి నాన్నా అని కోరడం. ఎన్‌టీఆర్‌ కాదనలేకపోయారు. పైగా, ఉమ్మడి ఏపీలో పాలనా వ్యవహారాలలో నమ్మకమైనవ్యక్తే తోడుగా ఉండాలి. అదికూడా వేరెవ్వరో అయితే మళ్లీ సమస్యే. ఏకంగా తన గారాల పట్టి భర్త చంద్రబాబు అయితే నమ్మవచ్చని పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ చేర్చుకోవడం సింహద్వారం ఎంట్రీ ఇద్దామని అప్పటి తన కుడిభుజం ఆర్ధికమంత్రి నాదెండ్లను పురమాయించారు. నిర్మోహమాటంగా చెప్పే నాదెండ్ల అయ్యా ఎన్‌టీఆర్‌ మీ అల్లుడయితే కావచ్చు. కానీ, అతడు మహాతేడా. డబ్బిచ్చి కాంగ్రెస్‌లో మంత్రిపదవి పొందాడు. డబ్బు యావ ఎక్కువ. ఇప్పుడు చెప్పినమాట గంట తర్వాత మరి ఆయనలో వెతికితే కనబడదని మరికొన్ని గంపగుత్తిగా చెప్పారు.

నాదెండ్ల మాటలు ఎన్‌టీఆర్‌కు మింగుడు పడలేదు. అల్లుడువారిని మనం మార్చుకుందాం. ఏదైనా మనమద్య ఉంటాడని స్వాగతించి తన వృద్ధాప్యంలో విలవిలలాడించే  పిడుగును కొనితెచ్చుకున్నారు. బాబు వచ్చాక నాదెండ్ల అవుట్‌ అయ్యారు. మరో కుడిభుజం ఉపేంద్ర కూడా తరిమివేయబడ్డారు. ఇలా చాలామందిని బాబు పార్టీలో లేకుండా చేసేసారు. ఒకదశలో ఎన్‌టీఆర్‌ పుత్రోత్సాహంతో నాబిడ్డ బాలకృష్ణ నాయీ పార్టీకి రాజకీయ వారసుడని ఓసభలో ప్రకటించారు. దాంతో బాబు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆవెంటనే ఎన్‌టీఆర్‌తో నాసంగతి ఏమిటని అడగడానికి దమ్ముచాలక, బాలకృష్ణ వారసుడని చెప్పడం వలన లేనిపోని కుటుంబగొడవలు వస్తాయి. ఆమాట వెనక్కి తీసుకోమని పదేపదే చెప్పి మరోసభలో చెప్పించారు. అక్క ణ్నించి బాబుకు ఎన్‌టిఆర్‌ ఏడుగురు కుమారులపై ప్రత్యేకదృష్టి పడింది. వారెవరూ తన కదలికలకు, తన సీఎం సీటు యావకు అడ్డంపడకుండా చాపకింద నీరులా కుట్రలు ఆరంభించారు.

ఈ నేపధ్యంలో బాలకృష్ణ ఇంట్లో తుపాకి కాల్పులు కలకలం, సినీనిర్మాత బెల్లంకొండ సురేష్‌, జ్యోతీష్యుడు చౌదరి బుల్లెట్‌ గాయాలతో ఆసుపత్రి పాలుకావడం ఇవన్నీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగాయి. అంతకు ముందే బాబు వెన్నుపోటుకు గురయిన ఎన్‌టీఆర్‌ దివంగతులు కావడం దాదాపు పదేళ్లబాబు సీఎంగా బాబు పాలించడం అన్నీ దశలు వారిగా జరిగిపోయాయి. బాలకృష్ణ ఇంట కాల్పులు కేసులో బాబు ఒక్కమాట ఆడకుండా పెదాలకు ప్లాస్టర్‌ వేసుకున్నారు. అప్పటి సీఎం వైయస్‌ టీడీపీపై కక్షతో బాలకృష్ణపై కేసులు మరింత తీవ్రంగా బనాయించి జైలు పాల్జేస్తారని, ఈ విధంగా శత్రుశేషం ఒకింత కుంటుపడుతుంని బాబు ఆశించారు. కానీ, వైయస్‌ పోలీసులకు అత్యుత్సాహం చూపవద్దు. సాదా సీదాగా కేసు కట్టండన్నట్లుగా సూచించారనే నమ్ము-నమ్మకపో మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈవిషయాన్ని ఈమద్య షర్మిళ తన ప్రచారసభల్లో బాలయ్య ఇంటకాల్పులలో నాతండ్రి ఎంతో సేవ్‌ చేసారు.

అదే బాలకృష్ణ నాపై అభాండాలకు ఆయన ఇంటినే వేదికను చేసారు. బాలయ్యలో వీసమెత్తు విశ్వాసమే లేదనిచెప్పి వాపోయారు. బాబు ఆంతర్యం ఎవరికి మింగుడుపడదు. తనకు అడ్డం అనుకునేవారి లెక్కలు తేల్చడంలో బాబు అనుక్షణం ఉంటారు. ఇదే ఆనాడు బాలయ్య విషయంలో బాబు మౌనానికి అసలు కారణంగా సర్వప్రజలు గుర్తించారు. ఇదే చంద్రబాబు లెక్కలేనన్ని ఉచితహామీల  పరంపరతో  బీజేపీతో పొత్తులో 2014లో అధికారం చేపట్టారు. ఒకప్పుడు ఇదే బీజేపీలో ప్రధాని వాజ్‌పాయ్‌కి సంఖ్యాబలం తక్కువప్పుడు  తన ఎంపీల మద్ధతు ఇస్తూ ఒకరకంగా బాబు ఢిల్లీలో చక్రంతిప్పారు. వాస్తవానికి అక్కడ చక్రంతిప్పింది బాబు కాదు. దివంగత ఎంపీ ఎర్రంనాయుడే. ఢిల్లీలో ఎర్రన్నాయుడు ఎదుగుదల, ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద పెరుగుతున్న పలుకుబడి బాబు జీర్ణించుకోలేకపోయారు. పైగా, కేంద్రమంత్రిగా ఎర్రన్నాయుడు ఇండియాటుడే అనే జాతీయ ఆంగ్లపత్రికకు తాను ఎప్పుడైనా రాష్ట్రంలో చేసే పదవి సీఎమ్మే తప్ప మరోపదవి లేదని నవ్వుతూ చెప్పడం బాబు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే  కేంద్రంలో పదవులు వద్దని స్పీకర్‌ పదవికి మాత్రమే సై అని అందుకు బాలయోగిని రెడీచేసి ఎర్రన్నాయుడు ఎదుగుదలకు అడ్డుకట్టవేసారు.

2014లో గెలిచిన చంద్రన్న ఢిల్లీలో ఇక మోదీని తను తిప్పే చక్రంలో ఇరికిద్దామని వెళ్లి కలిసారు. కేసుల్లో ఇరుక్కున్న జగన్‌పై మరింత బిగుసుకునేలా చేద్దాం. ఇబ్బడిముబ్బడిగా నిధులు మోదీ నుంచి అందిపుచ్చుకుందామని ఎన్నడూ నవ్వని బాబు నవ్వులపువ్వులై మోదీముందు కూర్చున్నారు. మోదీ సీరియస్‌గా బాబును చూస్తూ ఎందుకు ప్రాంతీయపార్టీతో తంటాలు? మీ టీడీపీని బీజేపీలో కలిపేసి మీరే సీఎంగా ఏలుకోవచ్చు అని సూచనచేసారు. దాంతో బాబుకు వెన్నుపోటుతో సాధించుకున్న నా బంగారు బాతును ఆర్‌ఎస్‌ఎస్‌, ఆనందమార్గ్‌ మరకలతో ఉన్న బీజేపీలో కలపాలా అని విలవిలమన్నారు. కానీ, బయటపడలేదు. మావాళ్లతో మాట్లాడాలి అని చెప్పి తిరిగి వచ్చి ఆవెంటనే టీడీపీని జాతీయ పార్టీగా మార్చేసారు. ఉత్తరకుమార ప్రగల్భాలను వల్లెవేసారు. దేశమంతటా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నట్లు తాటాకు చప్పుళ్లు ఢిల్లీలో విన్పించేలా చేసారు. ఇక్కడే మోదీకి బాబుకు బెడిసింది. ఇవ్వవల్సిన ఏపీ హోదాను, రైల్వేజోన్‌ను మోదీయే మసిగుడ్డలో మూటకట్టి మూలపడేసారు.

జాతీయపార్టీ అధ్యక్షుడుగా బాబు టీడీపీని తెలంగాణాలో ఏస్థాయిలో నిలపలేనన్న బాధ బాబుకు పెచ్చయ్యింది. దాంతో పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో బాబే గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. ఎలాగైన ఎమ్‌ఎల్‌సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఎమ్‌ఎల్‌సీ ఎన్నికల్లో ఓటుకునోటు కేసులో అడ్డంగా, నిలువుగా గుప్పెడు ఆధారాలతో దొరికిపోయారు. కేసీఆర్‌ సర్కారు వేసిన వలలో స్వయాన బాబే దొరికిపోయి బిక్కముఖం వేసారు. కేసీఆర్‌ ఏక్షణమైన అరెస్టు చేస్తారని మీడియా వార్తలకు బాబు నిలువెల్లా కంపించిపోయారు. అదే మీడియాలో నీకు సీఎమ్‌ పదవి ఉంది, నాకుంది. నీకు పోలీసులున్నారు. నాకు పోలీస్‌ బలగం ఉంది. ఇలా ఏదేదో చెప్పి కేసీఆర్‌ చేపట్టే చర్యలను నిలు వరించాలనుకున్నారు. హైద్రాబాద్‌లో తనింటి చుట్టూ ఏపీ పోలీసు అధికార్ల పహారాలో రాత్రిళ్లు నిద్రపోసాగారు. రోజు ఇదేం కర్మ అన్నట్లు చికాకుగా ఫీలయ్యారు. కేసీఆర్‌ చేపట్టే అరెస్టు భయంతో బాబు రాత్రికిరాత్రే అమరావతికి పారిపోయారు.

కేసీఆర్‌ బాబుతీరును ఎద్దేవాచేసారు. ఇద్దరిమద్య పచ్చగడ్డి భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. బాబు పదేళ్లపాటు ఉండాల్సిన సచివాలయాన్ని గాలికిధూళికి వదిలేసి అమరావతిలో పడరానిపాట్లకు ఏపీ అధికార్లను గురిచేసారు. ఇవేవి టీడీపీలో పెద్దతలకాయలకు కూడా అంతుపట్టలేని బాబు వైఖరి అయ్యింది. నిత్యం ఓటుకునోటు కేసు వెంటాడుతున్నట్లు కథనాలు మీడియాల్లో వస్తుంటే కేసీఆర్‌ చెరుగుతున్న చండ్రనిప్పులు చల్లార్చే ఎత్తుగడ బాబు ఏదోవేసారు. ఆఎత్తుగడ ఏమిటో నేటికి ఎవరికి అంతుబట్టలేదు. ఒక్కసారి కేసీఆర్‌ అండ్‌ కో చప్పున చల్లారిపోయింది. ఆనాటి నుంచి నేటికి కనీసం ఓటుకు నోటు పొగ కూడా రాకుండా నీరుగారింది. కోర్టులో ఉందని విన్పిస్తుంది. ఇప్పుడు కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భుజాలు కలపడం బాబు అందుకే  తట్టుకోలేకుండా ఉన్నారు. కేసీఆర్‌ ఏమైన లీకయితే జగన్‌ మీడియా ప్రచంఢంగా ప్రచారం చేస్తుందని బాబు బితుకు. తీరా, ఓటుకు నోటు కేసు చప్పబడడానికి బాబు ఏమేరకు కేసీఆర్‌ను సంతుష్టులను చేసారో అందులో ఇద్దరు తేలుకుట్టిన బాపతులే. బాబు అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారని టాక్‌ సర్వత్రా ఉంది.

అందుకే 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు తెలంగాణాలో సర్వశక్తులు కూటమితో బాబు తలపడ్డారు. అప్పుడు కూడా బాబుపై తీవ్రంగా దుయ్యబట్టుడులో కేసీఆర్‌ ఉన్నారే తప్ప ఓటుకు నోటు కేసుపై పెద్దగా గొంతు చించుకోలేదు. అంతగా బాబుతో సంతుష్టులయ్యారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయడమనేది బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రజలు కోడై కూస్తుంటారు. ఇది కూడా పక్కా కార్బన్‌కాపీయే. ఇందులో బాబు స్వంతానికి ఈ మేనేజ్‌మెంట్‌ కనిపెట్టలేదు. వైయస్‌ సిఎమ్‌గా ఢిల్లీ వెళ్లేటప్పుడు అక్కడ కేంద్రమంత్రులను తనమాట సోనియా వద్ద  చెల్లుబాటు అయ్యేలా వారిని మేనేజ్‌ చేసేవారు. ఇవన్నీ బాబు ఆకలింపు చేసుకునేవారు. తనుకూడా  ఇలా చేయాల్సిందని లోలోపల అనుకుని బయటికి మాత్రం విమర్శలు గుప్పింపులో తనమందిని వాడేవారు. 2014లో మోదీ తనను ఖాతర్‌ చేయడంలేదని 29సార్లు ఢిల్లీ యాత్రల్లో తొలియాత్రతోనే బాబు పసిగట్టేసారు. అక్కణ్నించి అప్పటి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌ ద్వారా ప్రధానికి చెప్పించడంలోనే గడిపేసారు.

మోదీకే నప్పని బాబు విషయంలో ఎవరు చెప్పేసాహసం చేయగలరు? ఢిల్లీలో వైయస్‌ ఆనాడు సాధించుకున్నారు. బాబు పొత్తులో ఉండి బీజేపీ సర్కారు నుంచి ఏమీసాధించుకోలేక చతికిలపడ్డారు. నిధులు రాకపోయినా, హోదా ఇవ్వకున్నా, జోన్‌ లేదన్నా బీజేపీ చూరుపట్టుకుని నాలుగేళ్లపాటు బాబు వేలాడారు. ఎప్పుడయితే మోదీ వైకాపా నేతలతో భుజాలరాపిడికి పాల్పడ్డారో బాబు తట్టుకోలేకపోయారు. బాబు పొత్తువదిలేసి మోదీపై సింహనాదాలు చేసి చేసి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి మూలకుచేరారు. సీఎం జగన్‌ తన అవినీతిపై పెట్టేకేసులు తలచుకుని మోదీపై ఏవగింపును వదిలేసారు. అన్నిశాఖల్లో వేలకోట్ల అవినీతిపై అసెంబ్లీలో వైకాపా విచారణలు జరుపుతామంటుంటే బాబుఅండ్‌కో బెంబేలు పడిపోతున్నారు. బాబుకు విచారణ అన్నా, కేసులన్నా వల్ల మాలిన బితుకు. అందుకే దివంగత వైయస్‌పై విమర్శలు సభలో గుప్పించి జగన్‌ను నిలువరించాలనుకున్నారు. ఆ ఆటసాగలేదు. నాబెస్టు ఫ్రెండ్‌ వైయస్‌ అని సభలో చెప్పి ఎగతాళికి గురయ్యారు.

కృష్ణా కరకట్టల్లో అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మింపబడ్డ గూట్లో ఉంటూ రాష్ట్రమంతా 70వేల మంది ఇలాంటి అక్రమకట్టడాల్లో ఉన్నారని, అవి కూలుస్తారా అని చెప్పే సాహసం కూడా సభలో వెలవెలబోయింది. అధికారపార్టీలో కొత్తవారైన మంత్రులు, ఎంఎల్‌ఏలు చండ్రనిప్పులు కురిపించడం, నిట్టనిలువునా బాబు అండ్‌కో అవినీతి కడుగుతున్నారు. ఇవేవి బాబు తట్టుకోలేకుండా ఉన్నారు. బాబు ఆకస్మికంగా అమెరికాకు వైద్యం కోసం వెళ్లారని ఆపార్టీవారు చెబుతున్నారు. మీడియాలో అదేకథనం వెలువడింది. కానీ, అదేపార్టీలో గుసగుసలు ఆరంభం అయ్యాయి. బాబు మనస్సులో ఏముందనేది ఆకుటుంబ సభ్యులకే తెలియనివ్వరు.  బాబు ఒక ఆరోగ్యనిధి. అధికారం ఉన్నా లేకపోయినా రోజుకు 18గంటలు పనిచేసే ఆరోగ్య సంపన్నుడు. మరెందుకు అమెరికా వెళ్లారని బాబుపార్టీలో జవాబులేని బేతాళప్రశ్న ఉత్పన్నమయ్యింది. వారివద్దనే ఒక జవాబు కూడా విన్పిస్తోంది. అదేమంటే శత్రువులను సయితం తను మేనేజ్‌చేసి కుదగొట్టగలరు.

అమెరికాలో ఏపీకి చెందిన మహాప్రముఖులు, రాజకీయ సంపన్నులున్నారు. వారిలో ఒకరిద్దరు నిత్యం జగన్‌తో టచ్‌లో ఉన్న వారున్నారు. వారిద్వారా జగన్‌కు గత సర్కారు పాలనలో అవినీతిని తవ్వకుండా నిలువరించడానికి బాబు వైద్యం పేరుతో అమెరికా వెళ్లారనే కథనం ఒకటి వినిపిస్తోంది. వ్యవస్థలను, వ్యక్తులను మేనేజ్‌చేసే బాబుకు ప్రభల శత్రువు కాంగ్రెస్‌కు చెందిన కేంద్రమంత్రి చిదంబరంతో అర్ధరాత్రి మంతనాలప్పుడే బాబు మహాకార్యవాదని తేలిపోయింది. అలాంటి బాబుకు ఇదేమి ఆసాధ్యం కాదని ఆపార్టీలో గుసగుసలయ్యాయి. బాబు ఆంతర్యం పచ్చమీడియాలకే తెలియదు. అలాంటి రాజకీయ అల్లకల్లోల చంద్రన్న.
-యర్నాగుల సుధాకరరావు

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన