బాలీవుడ్ మీద గట్టిగా కాన్సన్ ట్రేట్ చేసింది రష్మిక. సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లో హీరోయిన్ల పారితోషికాలు చాలా ఎక్కువ. దీంతో బాలీవుడ్ అవకాశాలు వస్తే కాదనే హీరోయిన్లు బాగా అరుదు. కెరీర్ లో ఏదో ఒక దశలో అయినా బాలీవుడ్ లో నటించాలని తపించే హీరోయిన్లే అంతటా ఉంటారు. మరి అక్కడ అవకాశాలు కలిసి వస్తే ఎగిరి గంతేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో రష్మిక కూడా ఉంది.
ఇప్పటికే బాలీవుడ్ అవకాశాలను ఒడిసిపడుతోంది రష్మిక. చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. వాటికి తోడు పుష్ప వంటి సినిమాతో హిందీ బెల్ట్ లో బ్రహ్మాండమైన గుర్తింపు లభించింది. ఇక పుష్ప పార్ట్ టూ మీద కూడా రష్మిక చాలా ఆశలే పెట్టుకుని ఉంది. ఆ సంగతలా ఉంటే.. అంతలోపే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా సాగిపోవడానికి రష్మికకు అవకాశాలు లభిస్తున్నట్టుగా ఉన్నాయి.
ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలకు తోడు.. బాలీవుడ్ లో ఈ హీరోయిన్ కు మరో అవకాశం లభించిందని తెలుస్తోంది. ఈ సారి టైగర్ ష్రాఫ్ తో రష్మిక జత కడుతోందట. హాలీవుడ్ *రాంబో* ను టైగర్ ష్రాఫ్ తో రీమేక్ చేయనున్నారట. ఇందులో రష్మికకు హీరోయిన్ అవకాశం లభించిందని సమాచారం.
అలాగే రణ్ బీర్ కపూర్ *అనిమల్* కూడా రష్మిక చేతిలో ఉంది. ఇలా వరస పెట్టి బాలీవుడ్ అవకాశాలు రష్మిక రెమ్యూనిరేషన్ ను అమాంతం పెంచేయడం పెద్ద వింత కాదు. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ ను సునాయాసంగా అందుకుంటూ ఉంటారు.
సౌత్ లో మూడు నుంచి ఆరు కోట్ల రూపాయలు గరిష్ట స్థాయి. బాలీవుడ్ లో ఈ రెమ్యూనిరేషన్ రెట్టింపు అవుతుంది. మరి రష్మిక ఊపు చూస్తూ ఉంటే.. పది పన్నెండు కోట్ల రూపాయల స్థాయి క్లబ్ లో జాయిన్ అవుతున్నట్టుగానే ఉంది.