డియర్ కామ్రేడ్ కథ ఇక ముగిసినట్టేనా!

సినిమాల విడుదలకు టైమింగ్ ఎంత ముఖ్యమో చాలామంది స్టార్ హీరోలకు అనుభవంలో ఉన్న విషయమే. సినిమా యావరేజ్ గా ఉన్నా మంచి టైమ్ లో రిలీజైతే కలెక్షన్లకు దిగులుండదు. మహేష్ బాబు మహర్షి విషయంలో…

సినిమాల విడుదలకు టైమింగ్ ఎంత ముఖ్యమో చాలామంది స్టార్ హీరోలకు అనుభవంలో ఉన్న విషయమే. సినిమా యావరేజ్ గా ఉన్నా మంచి టైమ్ లో రిలీజైతే కలెక్షన్లకు దిగులుండదు. మహేష్ బాబు మహర్షి విషయంలో ఇది బాగా వర్కవుట్ అయింది. మహర్షి తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా వీకెండ్ వండర్స్ గానే నిలిచాయి. థియేటర్ల నుంచి మహర్షిని ఎత్తేసే సాహసం ఎవరూ చేయలేదు. అందుకే లాంగ్ రన్ లో మహర్షి సక్సెస్ అయింది. దీనికి పూర్తి రివర్స్ లో ఉంది డియర్ కామ్రేడ్ పరిస్థితి.

విజయ్ దేవరకొండ భారీగా ఆశలు, ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా ఇది. అనుకోకుండా ఇస్మార్ట్ శంకర్ కాస్త లేట్ గా విడుదల కావడం, కామ్రేడ్ తర్వాత వచ్చిన సినిమాలు రెండూ కుదురుకుంటున్నట్టు కనిపించడంతో డియర్ కి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ సినిమాల మధ్య అడ్డంగా బుక్కైపోయాడు డియర్ కామ్రేడ్. కామ్రేడ్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయి ఉంటే, దానికంటే ముందు రిలీజైన మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి కలెక్షన్లు, థియేటర్లు క్రమంగా తగ్గేవి. కానీ అలా జరగలేదు. శంకర్ కి కామ్రేడ్ త్రెట్ అవుతుందనుకుంటే.. కామ్రేడ్ కే దెబ్బకొట్టాడు ఇస్మార్ట్ శంకర్.

తాజాగా విడుదలైన రాక్షసుడు, గుణ 369 సినిమాలు కూడా తీసిపారేయదగ్గవి కాకపోవడంతో విజయ్ దేవరకొండ సినిమాకి లాంగ్ రన్ కష్టమయ్యేలా కనిపిస్తోంది. రాక్షసుడు, గుణ సినిమాలు రెండూ మాస్ జనాలకు ఎక్కే సినిమాలే. పైగా రెండింటిపై నెగెటివ్ టాక్ కాస్త తక్కువగానే ఉంది. సో.. వీటన్నింటి ఎఫెక్ట్ కచ్చితంగా డియర్ కామ్రేడ్ పై కనిపిస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తాజాగా వచ్చిన సినిమాల దెబ్బతో మరో వారం రోజుల్లో డియర్ కామ్రేడ్ కథ ముగిసేలా ఉంది.

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!