షూటింగ్ లపై ఏస్ ప్రొడ్యూసర్ లెక్క వేరు

ఒక్క పక్క నిర్మాతలు, దర్శకులు కలిసి సిఎమ్ ను కలిసి షూటింగ్ లు చేసుకుంటాం అనుమతులు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఆతృతగా వున్నాయి.…

ఒక్క పక్క నిర్మాతలు, దర్శకులు కలిసి సిఎమ్ ను కలిసి షూటింగ్ లు చేసుకుంటాం అనుమతులు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఆతృతగా వున్నాయి. కానీ దాదాపు అందరు టాప్ స్టార్ లు ఇప్పట్లో తాము షూటింగ్ లకు వచ్చేది లేదు అనే భావనలోనే వున్నారు. సీనియర్లు అంతా ఇప్పటికే ఆ విషయం తమ తమ నిర్మాతలకు తెగేసి చెప్పేసారు. 

ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ కింగ్ పిన్ అయిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, కమ్ ఎగ్జిబిటర్ ఆలోచన వేరుగా వుందని తెలుస్తోంది. ఆయన సినిమాలు అనేకం ప్లానింగ్ లో వున్నాయి. నిర్మాణంలో వున్నాయి. విడుదలకు రెడీగా వున్నాయి. అయినా కూడా షూటింగ్ లకు అస్సలు తొందరపడడం లేదట. 

'ఇప్పుడు సినిమా హఢావుడిగా చేసి ఏం చేయాలి? థియేటర్ల సంగతి తేలాలి? అవి ఓపెన్ కావాలి, అప్పుడు కదా?' అని అంటున్నారని బోగట్టా. ఇలా అనడం వెనుక అసలు సంగతి వేరుగా వుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్న పెద్ద సినిమా కనుక హడావుడిగా ఏదో విధంగా పూర్తి చేసారు అనుకోండి. అర్జెంట్ గా ఆ టాప్ హీరోకు బ్యాలన్స్ రెమ్యూనిరేషన్ కోట్లకు కోట్లు ఇవ్వాలి. అలాగే పేమెంట్లు అన్నీ ఇవ్వాలి. కొత్త సినిమాలు ప్లాన్ చేసారు అనుకోండి, డేట్ ల కోసం, అగ్రిమెంట్ లుచేయాలి. పెద్ద హీరోలకు అడిగినంతా అడ్వాన్స్ లు ఇవ్వాలి. ఇలా కోట్లకు కోట్లు ఇచ్చేసి, వడ్డీలు కట్టుకుంటూ పొవాలి. 

అందుకే ప్రస్తుతానికి ఆలా ఆఫీసులు తీసుకుని కూర్చోవడం తప్ప, సినిమా నిర్మాణాల విషయంలో హడావుడి అనవసరం అని తాను నమ్మడమే కాకుండా, తన సన్నిహితులతో కూడా అదే చెబుతున్నారట ఆ టాలీవుడ్ కింగ్ పిన్. 

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను