అసలు ఫామ్లో లేని ఒకప్పటి స్టార్ దర్శకుడు చాలా కాలం తర్వాత బ్లాక్బస్టర్ సాధిస్తే 'హీ ఈజ్ బ్యాక్' అంటారు. కానీ 'ఇస్మార్ట్ శంకర్' విషయంలో 'పూరి ఈజ్ బ్యాక్' అనడానికేమీ లేదు. హీ ఈజ్ బ్యాక్ అనడం కంటే… ఇది ఫ్లూక్ అనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది. దర్శకుడిగా పూరి ఎలాంటి పరిణతి చూపించలేకపోయాడు. ఈమధ్య కాలంలో తాను తీస్తోన్న సినిమాలకీ, దీనికీ కథ, సన్నివేశాల పరంగా పెద్దగా తేడా లేదు.
ఈసారి కమర్షియల్ మసాలా మిశ్రమం కాస్త బాగా కలవడంతో పాటు విడుదలకి ముందు కావాల్సిన హైప్ కూడా బాగానే వచ్చింది. అదీ కాక సరయిన మాస్ సినిమా లేని లోటు చాలా కాలంగా మిగిలిపోవడంతో వారికి 'ఇస్మార్ట్' దొరికింది. వారం రోజుల పాటు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పండగ చేసుకుంది. అయితే పూరి జగన్నాధ్ని మాత్రం ఇంకా స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు.
ఇక స్టార్ హీరోలు తనవైపు చూడరనే సంగతి తనకి కూడా తెలిసినట్టుగా పూరీ కూడా వాళ్లపై అసందర్భమైన సెటైర్లు వేస్తున్నాడు. విశేషం ఏమిటంటే టయర్ 2 హీరోలు కూడా పూరితో సినిమా కోసం ఆరాటపడడం లేదు. ఇస్మార్ట్ విజయం నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని సక్సెస్ చేసుకుని నిజంగానే మళ్లీ బ్యాక్ టు ఫామ్ అనిపించుకోవాలని చూస్తోన్న పూరీకి ఇంతవరకు నెక్స్ట్ సినిమా హీరో సెట్ కాలేదు.