మీడియం బడ్జెట్ చిత్రాలదే హవాగా మారిన ట్రెండ్‌లో నెక్స్ట్ రాబోతోన్న నాని చిత్రం 'గ్యాంగ్‌లీడర్'కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ చిత్రం టీజర్ చాలా ఆకర్షణీయంగా వుండడంతో దీనిపై నమ్మకం కూడా డబుల్ కూడా అయింది. భారీ చిత్రాలు కొనడానికి వీల్లేనంత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తుండడంతో వాటిపై మొత్తం ఒకేసారి రిస్క్ చేయడం కంటే రిస్క్ తక్కువ రిటర్న్స్ ఎక్కువ అయిన మీడియం బడ్జెట్ చిత్రాలకి గిరాకీ పెరిగింది.
రాబోయే ఈ రేంజ్ సినిమాలలో 'గ్యాంగ్‌లీడర్' బాగా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. దీంతో ఈచిత్రానికి రెగ్యులర్ బయ్యర్లనుంచే కాకుండా లోకల్‌గా ఏరియాల వారీ బయ్యర్ల నుంచి కూడా పోటీ నెలకొంది. ఆగస్ట్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతానికి సెప్టెంబర్ రెండవ వారానికి వాయిదా పడింది.
ఒకవేళ చిరంజీవి 'సైరా' రిలీజ్ వాయిదా పడితే దసరా వీకెండ్లో రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. జెర్సీతో ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని మళ్లీ ఈ చిత్రంతో ఒక నిఖార్సయిన కమర్షియల్ విజయం కోసం చూస్తున్నాడు.