‘మంచి రోజులు’ వస్తాయా?

మారుతి లాంటి హిట్ డైరక్టర్ ఓ చిన్న సినిమా నేరుగా డైరక్ట్ చేస్తున్నారు అంటే ఆ క్రేజ్ వేరుగా వుంటుంది. పైగా యువి లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తోంది.  Advertisement అలాంటి సినిమాలో…

మారుతి లాంటి హిట్ డైరక్టర్ ఓ చిన్న సినిమా నేరుగా డైరక్ట్ చేస్తున్నారు అంటే ఆ క్రేజ్ వేరుగా వుంటుంది. పైగా యువి లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తోంది. 

అలాంటి సినిమాలో సిద్దు శ్రీరామ్ లాంటి టాప్ సింగర్ పాట పాడితే..అన్నీ కలిసి ఆ పాట ప్రోమో ఎలా వుండాలి…దుమ్ము దుమారం కావాలి గా. 

కానీ మంచిరోజులు వచ్చాయి సినిమా నుంచి వదిలిన 'దుమ్ము దుమారం' అన్నట్లు వుండాలి కదా. కానీ అలా జరగలేదు. 

విడుదల చేసి మూడు రోజులు అయినా పట్టుమని 60 వేల వ్యూస్ తెచ్చుకోలేదు. పాట మరో రోజులో విడుదల కావాల్సి వుంది. ఈ లోగా ఈ పైలట్ టీజర్ మాత్రం ఇంకా లక్ష వ్యూస్ కూడా తెచ్చుకునేలా లేదు.

జాతిరత్నాలు సినిమాలో చిట్టీ నీ నవ్వంటే పాట లో కొన్ని చరణాలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఈ సాంగ్ ను కేకె రాసినట్లుంది. మెహరీన్-సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లు ఈ సినిమాలో.