ఈ మధ్య కాలం తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలంగాణలో రాజకీయాల కంటే ఆంధ్ర రాజకీయాలపై కామెంట్ చేయడం పరిపాటిగా అయినట్లు కనపడుతోంది. హరీష్ రావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూన్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతల నుండి ఎటువంటి ప్రతి స్పందన రావడం లేదు. తాజాగా ఎట్టకేలకు ఇవాళ వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలీదని, వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా తమపై కామెంట్ చేయడం సరికాదన్నారు. హరీష్ రావుకు కేసీఆర్ తో ఏమైనా సమస్యలు ఉంటే వారు చూసుకోకుండా మమ్మలి తిట్టి మాతో కేసీఆర్ ను తిట్టించుకొవడానికి హరీష్ రావు కామెంట్లు చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
ఆంధ్ర ఉండే ఎల్లో గ్యాంగ్ పలుకులే ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పుతున్నంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. హరీష్ రావు కామెంట్లు వ్యక్తిగతంగా చేస్తున్నారు తప్ప టీఆర్ఎస్ నుండి విమర్శలు రాలేదన్నారు.
ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు చూస్తుంటే ఆంధ్ర నాయకులను రెచ్చగొట్టి వారితో తిట్టించుకొని సానుభూతి పొంది మళ్లీ ఎన్నికలల్లో తెలంగాణ సెంటిమెంట్ తెవాలని చూస్తున్నట్లు కనపడుతోందంటూన్నారు రాజకీయ విశ్లేషకులు. అయినా తెలంగాణ ప్రజలు ఇటువంటి ఎత్తుగడలకు ఇకపై పడరు అనేది తెలంగాణ ఇతర పార్టీల వాధన.