ఏపీలో ఒకే రోజు 4 కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు నలుగురు వ్యక్తులు కరోనాతో మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా…

ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు నలుగురు వ్యక్తులు కరోనాతో మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 68కు చేరుకుంది.

మరోవైపు కొత్త కేసులు కూడా రాష్ట్రంలో భారీ స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 180 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 79 కేసులు స్థానికంగా నమోదైనవి కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో 94 మందికి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఏడుగురికి పాజిటివ్ సోకినట్టు అధికారులు ప్రకటించారు.

కేవలం రాష్ట్రంలో నమోదైన కేసుల విషయానికొస్తే.. ఇప్పటివరకు 3279 కేసులు నమోదుకాగా.. 2244 మంది డిశ్చార్జ్ అయ్యారు. 68 మంది మృతిచెందగా.. 967 మందికి ట్రీట్ మెంట్ నడుస్తోంది.

జిల్లాల వారీగా చూసుకుంటే.. కరోనా కేసుల్లో తొలి స్థానంలో కర్నూలు, రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో కృష్ణ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అన్ని జిల్లాలతో కలుపుకొని 3,95,090 శాంపిల్స్ ను పరీక్షించింది రాష్ట్రప్రభుత్వం.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం