బెల్లంకొండ కు నచ్చని స్వాతిముత్యం డేట్?

సాధారణంగా నిర్మాత బెల్లంకొండ తన కొడుకు శ్రీనివాస్ సినిమా ల విషయంలో పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతారు. కథ వినడం దగ్గర నుంచి టెక్నీషియన్లు, పబ్లిసిటీ, మార్కెటింగ్, విడుదల తేదీ ఇలా ప్రతి దాంట్లో…

సాధారణంగా నిర్మాత బెల్లంకొండ తన కొడుకు శ్రీనివాస్ సినిమా ల విషయంలో పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతారు. కథ వినడం దగ్గర నుంచి టెక్నీషియన్లు, పబ్లిసిటీ, మార్కెటింగ్, విడుదల తేదీ ఇలా ప్రతి దాంట్లో ఇన్ వాల్వ్ అవుతారు. అది ఆయన కొడుకు కెరీర్ కు చాలా వరకు ప్లస్ అయింది. కొంత మైనస్ కూడా అయింది. 

ఆయన ఇన్ వాల్వ్ మెంట్ నచ్చని నిర్మాతలు బెల్లంకొండ హీరోకి దూరంగా వున్నారు. కానీ రెండో కొడుకు గణేష్ విషయంలో మాత్రం డిఫెరంట్ గా వెళ్లారు. గణేష్ తో ప్రారంభించిన తొలిసినిమా అర్థాంతరంగా ఆగిపోవడంతో, మలి సినిమా విషయంలో ఆయన వేలు పెట్టలేదు. కథ మాత్రమే విన్నారు.

సితార లాంటి పెద్ద సంస్థ నిర్మాత కావడంతో ఇక బెల్లంకొండ సైలంట్ గా దూరంగా వుండిపోయారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఒక్క విషయంలో అసంతృప్తిగా వున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఎంత దసరా సీజన్ అయినా రెండు పెద్ద సినిమాల మధ్యలోకి తన కొడుకు తొలి సినిమాను తోసేసారని బెల్లంకొండ అసంతృప్తిగా వున్నారని తెలుస్తోంది. తొలి సినిమా సరైన ఓపెనింగ్ తెచ్చుకోకపోతే, సరైన ఫలితాలు నమోదు చేయకపోతే సరైన పునాది పడదని ఆయన భావిస్తున్నట్లు టాక్.

నిజానికి స్వాతిముత్యం ట్రయిలర్ ప్రామిసింగ్ గా వుంది. పబ్లిసిటీ బాగానే వుంది. ఎటొచ్చీ ఒకటి కాకుండా రెండు పెద్ద సినిమాలు వుండడం, అది కూడా బుధవారం విడుదల అన్నది కాస్త ఇబ్బంది. తొలిరోజు సాయంత్రానికి కానీ సరైన టాక్ రాదు. అది మర్నాటికి కానీ నిలబడదు. అప్పటి నుంచి కలెక్షన్లు పికప్ కావాలి. దసరా సెలవులు 9 వరకు వుంటాయి. ఈ లోగా పెద్ద సినిమాల పోటీ తట్టుకుని స్వాతిముత్యం నిలబడాల్సి వుంటుంది.

లెక్కల్లో చూసుకుంటే స్వాతిముత్యం ఫుల్ సేఫ్. 11 కోట్ల ఖర్చుకు 8 కోట్లు నాన్ థియేటర్ వచ్చింది. కానీ సమస్య అది కాదు. బ్యానర్ వాల్యూ నిలబడాలి. కుర్రాడికి తొలిసినిమా హిట్ అనిపించుకోవాలి. అదే ఇటు నిర్మాతకు, అటు బెల్లంకొండకు సమస్య.