కాఫీడే సిద్ధార్థ మృతదేహం లభ్యం

కెఫే కాఫీడే ఫౌండర్ వీబీ సిద్ధార్థ మృతదేహం లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్నిగంటల కిందల మిస్ ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభించినట్టుగా సమాచారం. దీంతో ముందుగా కొంతమంది ఊహించినట్టుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే…

కెఫే కాఫీడే ఫౌండర్ వీబీ సిద్ధార్థ మృతదేహం లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్నిగంటల కిందల మిస్ ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభించినట్టుగా సమాచారం. దీంతో ముందుగా కొంతమంది ఊహించినట్టుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే విషయం ధ్రువీకరణ అయ్యింది. సిద్ధార్థ మిస్ అయిన బ్రిడ్జ్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహం కనిపించిందని తెలుస్తోంది.

సిద్ధార్థ ఆత్మహత్యకు కారణం ఆర్థిక వ్యవహారాలే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కొంతమంది ఉద్యోగులు ఆయనను వేధించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అక్కడకూ తన ఆస్తులు అమ్మి ఆయన భారీఎత్తున రుణ చెల్లింపులు చేశారని, అయినా ఇతర ఒత్తిళ్లు భరించలేక ఆయన ఈ దారుణానికి ఒడిగట్టారని సిద్ధార్థకు దగ్గరవాళ్లు చెబుతున్నారు.

సిద్ధార్థ తమకు ఎలాంటి బాకీలూ లేరని కొన్ని బ్యాంకులు ప్రకటనలు కూడా చేశాయి. కొన్నాళ్ల కిందట ఆయన చెల్లింపులు చేసినట్టుగా అవి పేర్కొన్నాయి. మరోవైపు సిద్ధార్థ ఆత్మహత్యతో కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఇరకాటంలో పడ్డాయి. ఆయనదే తప్పు ఉందని నిరూపించే ప్రయత్నంలో పడ్డాయి ఆ సంస్థలు.

ఆయన సంస్థల్లో బ్లాక్ మనీ దొరికిందని, పన్నులు చెల్లించలేదని అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటనలు చేస్తూ ఉండటం గమనార్హం!

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది