గాడ్ ఫాదర్…మాస్ యాక్షన్..ఓన్లీ

మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గా ప్రకటితమై…ఓ ఒరిజినల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఫినిష్ అయినట్లు కనిపిస్తోంది గాడ్ ఫాదర్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, సత్యదేవ్ నటించిన ఈ సినిమా…

మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గా ప్రకటితమై…ఓ ఒరిజినల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఫినిష్ అయినట్లు కనిపిస్తోంది గాడ్ ఫాదర్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, సత్యదేవ్ నటించిన ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. 

ఈ లోగా ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ కథ, కథనాలు లూసిఫర్ అడుగుజాడల్లోనే నడిచినా, మేకింగ్ చూస్తుంటే జనాలకు అలవాటైన మెగాస్టార్ మాస్ యాక్షన్ సినిమా భారీ రేంజ్ లో చూసినట్లు అనిపించింది.

లూసిఫర్ ఇచ్చే కొత్త అనుభూతిని గాడ్ ఫాదర్ ఇవ్వలేకపోయింది. దానికి చాలా కారణాలు వున్నాయి. మోహన్ లాల్ ఆహార్యం, కేరళలోని అందమైన కొత్త లోకేషన్లు, వివేక్ ఓబరాయ్ ఇలా చాలా ప్లస్ లు వున్నాయి లూసిఫర్ కు. ఒక వర్జిన్, ఆర్గానిక్ లుక్ వుంది లూసిఫర్ కు. కానీ గాడ్ ఫాదర్ దగ్గరకు వచ్చేసరికి మన ప్రేక్షకులకు అలవాటైన భారీ యాక్షన్ సినిమా చూసిన రెగ్యులర్ ఫీల్ నే కలిగింది.

పైగా మెగాస్టార్ దగ్గర ప్రోబ్లమ్ ఏమిటంటే, ఆయన నటనలో 70-80 దశకాల్లో అలవాటైపోయిన డ్రామా కనిపిస్తుంది.మోహన్ లాల్ దగ్గర అది వుండదు. అక్కడే ప్రధానమైన తేడా వచ్చింది. అదే లూసిఫర్ చూడకపోయినా, లూసిఫర్ ను ఆలోచనల్లోకి తీసుకురాకపోయినా, గాడ్ ఫాదర్ ట్రయిలర్ కు వంద మూర్కులు వచ్చేస్తాయి. థమన్ మరీ డిస్సపాయింట్ చేయలేదు కానీ అద్భుతం కూడా చేయలేదు. సత్య పాత్రను సరిగ్గా తీసుకురాలేదు ట్రయిలర్ లోకి. ఎన్వీ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.