బిగ్‌బాస్‌కి వైల్డ్‌ కార్డ్‌ కష్టమే

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మొదలైందో లేదో ఇంట్లో గొడవలు మొదలయిపోయాయి. ప్రతి ఒక్కరూ కయ్యానికి సై అంటే సై అన్నట్టున్నారు. నలుగురైదుగురు మినహా మిగతా వాళ్లంతా స్విచ్‌ వేస్తే పేలిపోతారేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వందరోజుల…

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మొదలైందో లేదో ఇంట్లో గొడవలు మొదలయిపోయాయి. ప్రతి ఒక్కరూ కయ్యానికి సై అంటే సై అన్నట్టున్నారు. నలుగురైదుగురు మినహా మిగతా వాళ్లంతా స్విచ్‌ వేస్తే పేలిపోతారేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వందరోజుల పాటు కాన్‌ఫ్లిక్టింగ్‌ పర్సనాలిటీస్‌ కలిసి వుండాల్సిన ఇంట్లో అభిప్రాయ బేధాలు రావడం సహజమే కానీ మరీ ఇలా ఒక్క రోజులో నాలుగైదు సార్లు కొట్టుకునేలా వుంటే షో నిర్వహించడం కష్టమవుతుంది.

ఈ షోలో ఒక నాలుగు వారాలు గడిచిన తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా ఒకరిని పంపుతారు. ఫస్ట్‌ సీజన్‌లో నవదీప్‌, సెకండ్‌ సీజన్‌లో పూజ రామచంద్రన్‌ అలాగే వెళ్లారు. ఈ హౌస్‌లోకి వెళ్లడానికి వైల్డ్‌ కార్డ్‌ క్యాండిడేట్లుగా కాస్త పేరున్న వాళ్లు దొరకడం కష్టమే. ఎందుకంటే దిన దినం గండం అన్నట్టుగా వున్న హౌస్‌లోకి ఏరికోరి ఎవరూ వెళ్లరు. ఎంత పారితోషికం చెల్లించినా కానీ ఆ రొంపిలోకి ఎవరూ దిగరు.

గత ఏడాది కూడా వైల్డ్‌ కార్డ్‌గా కొందరు టాప్‌ సెలబ్రిటీలని పరిగణించి ఎవరూ దొరక్క పూజతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఆమాత్రం పేరున్న వాళ్లు కూడా వెళ్లడం కష్టమేనేమో. శ్రద్ధాదాస్‌కి ఛాన్స్‌ వుందనే టాక్‌ వినిపిస్తోంది కానీ క్లారిటీలేదు. ఇదిలావుంటే ఈ బ్యాచ్‌కి నాగార్జున ఎలా బుద్ధిచెప్తాడు, ఏ విధంగా ఈ సీజన్‌ని నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారి అంతా వీకెండ్‌ ఎపిసోడ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌