అయ్యప్పన్ భారీగానా? మీడియంగానా?

అయ్యప్పన్ కోషియమ్ తెలుగు రీమేక్ అన్నది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. పృధ్వీరాజ్ మలయాళంలో చేసిన పాత్రకు రానా ఫిక్స్ అయిపోయాడు ఓ యంగ్ డైరక్టర్ తయారుచేసిన స్క్రిప్ట్ రానా వినడం మాత్రమే బాకీ. ఇక…

అయ్యప్పన్ కోషియమ్ తెలుగు రీమేక్ అన్నది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. పృధ్వీరాజ్ మలయాళంలో చేసిన పాత్రకు రానా ఫిక్స్ అయిపోయాడు ఓ యంగ్ డైరక్టర్ తయారుచేసిన స్క్రిప్ట్ రానా వినడం మాత్రమే బాకీ. ఇక కీలకమైన అయ్యప్పన్ పాత్రకు బాలకృష్ణ ఎస్  చెప్పడం ఒక్కటే తరువాయి. బిజూ మీనన్ చేసిన ఈ క్యారెక్టర్ చాలా కీలకం. 

బాలయ్య కు కథ చెప్పాలి. లేదా సినిమా చూపించాలి. ఆయన ఓకె అంటే వ్యవహారం ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ సినిమాను మరీ భారీగా తీయాలా? లేదా ఓ రేంజ్ లో తీయాలా, లేదూ మరీ భారీగా తీయాలా?అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. బాలయ్య-రానా, లేదా రవితేజ-రానా అంటే రెమ్యూనిరేషన్ నే చాలా వరకు బడ్జెట్ ను తీసేసుకుంటుంది. అందువల్ల ఏ రేంజ్ లో తీయాలి అన్నది ఆలోచన.

టాప్ రేంజ్ లో తీయాలంటే అందుకు తగ్గ డైరక్టర్ కావాలి. యంగ్ డైరక్టర్ ను తీసుకుంటే సినిమా సంగతి సరే కానీ, మార్కెటింగ్ కూడా కీలకం. అలా అని టాప్ డైరక్టర్ లు ఎవ్వరూ ఖాళీ లేరు. అందువల్ల అయ్యప్పన్ రీమేక్ కోసం ఏ మాత్రం తొందర పడడం లేదు కరోనా కల్లోలం తరువాత సినిమాల పరిస్థితి చూసి, మార్కెట్ చూసి, అప్పుడు డిసైడ్ కావాలనుకుంటున్నారు. 

ఎలాగూ బాలయ్య అయినా, రవితేజ అయినా, రానా అయినా ఇఫ్పట్లో రెడీగా లేరు. ఆరు నెలల తరువాత సంగతే. అందుకే  ఇప్పటి నుంచీ నిర్మాతలు తొందరపడడం లేదు. స్క్రిప్ట్ పూర్తిగా రెడీ చేయించుకునే పనిలో వున్నారు. ఇందుకోసం ఓ యంగ్ డైరక్టర్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌