రావు రమేష్.. స్పెషల్ సర్ప్రయిజ్

రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో హీరో నాగార్జున చేస్తున్న సినిమా మన్మధుడు 2. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ఇప్పటికే వచ్చేసాయి. సినిమాలో కమెడియన్ వెన్నెల కిషోర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ పండించినట్లు…

రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో హీరో నాగార్జున చేస్తున్న సినిమా మన్మధుడు 2. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ఇప్పటికే వచ్చేసాయి. సినిమాలో కమెడియన్ వెన్నెల కిషోర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ పండించినట్లు కనిపిస్తూనే వుంది. అయితే అంతకు మించిన సర్ప్రయిజ్ వుందట. అది రావురమేష్ క్యారెక్టర్.

మన్మధుడు 2 సినిమాలో రావురమేష్ పాత్ర ఫుల్ లెంగ్త్ లో సెటైర్లు వేస్తూ, నవ్విస్తూనే వుంటుందట. అ..ఆ సినిమా తరువాత మళ్లీ అంతకు అంతా రావురమేష్ ఫన్ పండించిన సినిమా ఇదే అని వినిపిస్తోంది. రావు రమేష్ క్యారెక్టర్ పూర్తిగా సర్ప్రయిజ్ ప్యాక్ లా వుంటుందని అంటున్నారు డైరక్టర్ రాహుల్ రవీంద్రన్.

ట్రయిలర్, టీజర్ ల్లో నాగ్ మీద, ఆయన వయసు మీద బాగానే పంచ్ లు పేలాయి. అవన్నీ వెన్నెల కిషోర్ మీద వచ్చాయి. రావురమేష్ కూడా బాగానే డైలాగులు పేల్చినట్లు, ఇవన్నీకలిసి మన్మధుడు 2ను రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా మార్చినట్లు కనిపిస్తోంది.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!