అనుకున్నదే జరిగింది.. అన్నీ తెరిచేశారుగా!

అంతా ఊహించినట్టే జరిగింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మినహాయింపులు ఇచ్చేశారు. ప్రస్తుతం షాపుల విషయంలో అనుసరిస్తున్న సరి-బేసి విధానానికి స్వస్తిచెప్పారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలో షాపులన్నీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయి.…

అంతా ఊహించినట్టే జరిగింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మినహాయింపులు ఇచ్చేశారు. ప్రస్తుతం షాపుల విషయంలో అనుసరిస్తున్న సరి-బేసి విధానానికి స్వస్తిచెప్పారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలో షాపులన్నీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయి. భారీ మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చని సీఎం చెప్పేశారు.

నిన్నటివరకు వస్త్ర దుకాణాలు, బంగారం వ్యాపారాలు, చెప్పుల షాపులకు అనుమతి లేదు. ఈసారి షాపుల విషయంలో మరిన్ని మినహాయింపులిస్తారని అంతా ఊహించారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం సింపుల్ గా అన్నింటిపై ఆంక్షలు ఎత్తేశారు. మరోవైపు రాత్రి వేళ కూడా ఆర్టీసీ సర్వీసులకు అనుమతినిచ్చారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 90 శాతం ఆంక్షలు ఎత్తేసినట్టయింది.

ఓవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఓవైపు ఇలా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, షాపులకు వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 107 కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణకు చెందినవి 39 కేసులు. సౌదీ అరేబియా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన వాళ్లలో 49 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికుల్లో 19 మందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు.  బుధవారం కరోనా వల్ల రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 63కు చేరుకుంది.

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు