ఆపరేషన్ ఆకర్ష్: టీడీపీలో మరో వికెట్ డౌన్

భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపించాయి. రాజ్యసభ టీడీపీ ఎంపీలంతా బీజేపీలో విలీనం అయ్యారు. ఇక్కడితో ఆపరేషన్ పూర్తవ్వలేదు. ఇప్పుడు మరో పెద్ద వికెట్…

భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపించాయి. రాజ్యసభ టీడీపీ ఎంపీలంతా బీజేపీలో విలీనం అయ్యారు. ఇక్కడితో ఆపరేషన్ పూర్తవ్వలేదు. ఇప్పుడు మరో పెద్ద వికెట్ పడబోతోంది. త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు రాయపాటి సాంబశివరావు.

గుంటూరులో టీడీపీ బడా లీడర్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్న రాయపాటి, త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతానికి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లలేదని, త్వరలోనే వాళ్లతో సంప్రదింపులు స్టార్ట్ చేస్తానని ఆయన ప్రకటించారు.

అయితే రాయపాటి పైకి అలా అన్నప్పటికీ ఆల్రెడీ ఆయన జంపింగ్ కు రంగం సిద్ధమైపోయింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాయపాటితో చర్చలు పూర్తిచేశారు. రాయపాటి చేరితే జిల్లాలో పార్టీ బలపడుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే దాదాపు 10 రోజులుగా చర్చలు జరిపి మరీ రాయపాటిని ఒప్పించింది.

మరోవైపు రాయపాటి కూడా టీడీపీలో ఇమడలేక సతమతమౌతున్నారు. గతంలో టీడీపీ ఛైర్మన్ పదవి ఆశించిన ఈయన భంగపడ్డారు. అప్పట్నుంచే పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. దీనికితోడు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా చంద్రబాబు, రాయపాటి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. అలా కొన్నాళ్లకు ఉప్పు-నిప్పులా పార్టీలో కొనసాగుతున్న రాయపాటి ఎట్టకేలకు బీజేపీలో చేరబోతున్నారు.

నిజానికి అధికారం ఎక్కడుంటే రాయపాటి అక్కడుంటారు. ఆయనను రాజకీయ నాయకుడు అనే కంటే బడా వ్యాపారవేత్త అనడం కరెక్ట్. ఆయనకు పొగాకు సంబంధిత వ్యాపారాలతో పాటు పలు కనస్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నీ సజావుగా సాగాలంటే ఆయనకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అండ అవసరం. దీనికితోడు కొడుకు రాజకీయ భవిష్యత్ కూడా అవసరం. అందుకే ఎన్నికలకు ముందే వైసీపీలో చేరేందురు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు బీజేపీ ఆయనను ఆహ్వానిస్తోంది. 

జగన్‌ ఐఏఎస్‌ మీటింగులో 'రిసీట్‌' అనే బదులు 'రిసీప్ట్‌' అన్నాడు..