టీటీడీపై బీజేపీ ఓవ‌రాక్ష‌న్, సుబ్ర‌మ‌ణ్య‌స్వామి హిత‌బోధ‌!

భార‌తీయ జ‌న‌తా పార్టీలోని కొత్త బిచ్చ‌గాళ్ల‌కు ఆ పార్టీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆస‌క్తిదాయ‌క‌మైన స‌ల‌హాలు ఇస్తున్నారు. అయిన‌దానికీ కానిదానికీ మ‌తం పేరుతో అతి రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌నేది సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఇస్తున్న కీల‌క‌మైన స‌ల‌హా. అలా చేస్తే…

భార‌తీయ జ‌న‌తా పార్టీలోని కొత్త బిచ్చ‌గాళ్ల‌కు ఆ పార్టీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆస‌క్తిదాయ‌క‌మైన స‌ల‌హాలు ఇస్తున్నారు. అయిన‌దానికీ కానిదానికీ మ‌తం పేరుతో అతి రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌నేది సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఇస్తున్న కీల‌క‌మైన స‌ల‌హా. అలా చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని, హిందుత్వం పేరుతో అన‌వ‌స‌ర‌మైన రాద్ధాంతాలు చేయ‌వ‌ద్ద‌ని స్వామి గ‌తంలోనూ సూచించారు. ప్ర‌త్యేకించి ఏపీ రాజ‌కీయాల మీద మాట్లాడుతూ స్వామి అటు బీజేపీకి హిత‌బోధ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చుర‌క‌లు అంటించారు.

టీటీడీ విష‌యంలో తెలుగుదేశం, బీజేపీ రాజ‌కీయాల‌ను అంతా చూస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మ‌న్ గా వైవీ సుబ్బారెడ్డి నియ‌మితం అయిన‌ప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్లు త‌ప్పుడు ప్ర‌చారానికి తెర తీసిన సంగ‌తి తెలిసిందే. సుబ్బారెడ్డి క్రిస్టియ‌న్ అని, ఆయ‌న‌ను జ‌గ‌న్ టీటీడీ చైర్మ‌న్ గా చేసి అప‌విత్రం చేశారంటూ తెలుగుదేశం వాళ్లు మొద‌ట్లోనే గ‌గ్గోలు పెట్టారు. ఏపీ బయ‌ట ఉన్న వీర హిందుత్వ‌వాదులు తెలుగుదేశం మార్కు డూప్లికేట్ ప్ర‌చారాన్ని న‌మ్మారు. అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హారంపై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి స్పందించారు.

సుబ్బారెడ్డి ప‌క్కా హిందువు అని.. త‌ప్పుడు రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని స్వామి సూచించారు. ఆ త‌ర్వాత హిందుత్వ రాజ‌కీయాల మీద ఒక టీవీ చాన‌ల్ స‌ద‌స్సులో కూడా సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీ విష‌యంలో తెలుగుదేశం పార్టీ విష‌రాజ‌కీయం చేసింద‌ని, అన‌వ‌స‌రంగా బుర‌ద జ‌ల్లే య‌త్నం చేసింద‌ని, దాన్ని హిందుత్వ వాదులూ అందిపుచ్చుకున్నార‌ని..అయితే ప‌స‌లేని త‌ప్పుడు ప్ర‌చారాల‌తో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గుర్తుంచుకోవాల‌ని స్వామి ఆ స‌ద‌స్సులో వ్యాఖ్యానించారు.

ఇక టీటీడీ విష‌యంలో తాజా రాజ‌కీయాల మీద కూడా సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. నిరార్ధ‌క ఆస్తుల‌ను అమ్మాల‌ని చంద్ర‌బాబు నాయుడి హ‌యాంలోని బోర్డే నిర్ణ‌యించింద‌ని స్వామి గుర్తు చేశారు. ఆ బోర్డులో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లే స‌భ్యులే అని చుర‌క‌లు అంటించారు. జ‌గ‌న్ క్రిస్టియ‌న్ అయినంత మాత్రాన అన్నింటి విష‌యంలోనూ బుర‌ద‌జ‌ల్లాల‌నే ప్ర‌య‌త్నాల‌ను మానుకుంటే మంచిద‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వ్యాఖ్యానించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు ఈ విష‌యంలో క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా స్వామి అన్నారు. తాము స‌భ్యులుగా ఉన్న‌ప్పుడు బోర్డు తీసుకున్న నిర్ణ‌యాల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిందించ‌డం ఏమిట‌ని ఆయ‌న సూటిగా బీజేపీ వాళ్ల‌కు ప్ర‌శ్న సంధించారు. నిరార్ధ‌క ఆస్తుల‌ను అమ్మకూడ‌ద‌ని జీవో జారీ చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అభిప్రాయ‌ప‌డ్డారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ కి చాలా ద‌గ్గ‌ర వ్య‌క్తి, ఆ పార్టీ ఎంపీ కూడా అయిన సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఇప్పుడే లేచి వ‌చ్చిన వీర బీజేపీ హిందుత్వ‌వాదుల‌కు వాళ్ల గురివింద చందాన్ని బాగానే వివ‌రించి చెప్పిన‌ట్టుగా ఉన్నారు. 

మన పాలన-మీ సూచన, 2వ రోజు