ఆమె ఓ పాపులర్ హీరోయిన్. టాలీవుడ్ జనాలు అంతా ఆమె తమ పక్కన నటించాలని కోరుకుంటున్నారు. కరోనా టైమ్ లో ఒక్క హిట్ తో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పేసుకుంది ఆ సుందరి.
నటన పెద్దగా రాదనే గ్యాసిప్ వున్నా, దర్శకులు కిందా మీదా పడి అయినా ఆమెనే తీసుకునేందుకు చూస్తున్నారు.
అలాంటిది ఓ యంగ్ హీరో మాత్రం ఆమె వద్దు అంటున్నాడట. ఆ పాపులర్ హీరో ఎందుకు ఆ హీరోయిన్ ను వద్దంటున్నాడో అన్నది మాత్రం టాప్ సీక్రెట్ గా మిగిలిపోతోంది. అదియును పతి ప్రాణంబు దక్క అన్నట్లుగా, ఆ హీరోయిన్ తప్ప ఎవరైనా ఓకె అంటున్నాడట.
పోనీ అలా అని ఇద్దరికీ ఏమైనా గొడవ అయిందా? అంటే అదీ లేదు. అస్సలు పరిచయమే లేదు. మరెందుకు అంటే ఆ ఒక్కటీ తప్ప అన్నదే ఆన్సర్ అవుతోందట.
సాయి పల్లవి మాదిరిగా అధ్భుతంగా నటించేస్తుంది అన్న భయం లేదు. ఎందుకంటే ఈ అమ్మడికి అందం తప్ప నటన అంతంత మాత్రం. మరింకెందుకు ఆ హీరో ఆమెను వద్దంటున్నాడో అతగాడికి మాత్రమే తెలిసిన సీక్రెట్.