ముగ్గురు హీరోలు కలిసారు..దానితల్లి

ఓ పాట ప్రమోషన్ కు ఆ పాట హీరోతో పాటు మరో ఇద్దరు హీరోలు జతకలిసారు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సోలో బతుకే సో బెటర్ సినిమా తొలిసాంగ్ ను ఈ రోజు…

ఓ పాట ప్రమోషన్ కు ఆ పాట హీరోతో పాటు మరో ఇద్దరు హీరోలు జతకలిసారు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సోలో బతుకే సో బెటర్ సినిమా తొలిసాంగ్ ను ఈ రోజు విడుదల చేసారు. ఈ పాట ప్రమోషన్ సాంగ్ లో వరుణ్ తేజ్, రానా కూడా పాలు పంచుకున్నారు.  సినిమా విడుదల ఎప్పుడు, వర్క్ ఎంత బ్యాలెన్స్ అన్నది అలా వుంచితే, ముందుగా ఓ సాంగ్ ను విడుదల చేసేసారు. నిజానికి ఈ పాటను లాక్ డౌన్ ముందు విడుదల చేయడానికే రెడీ చేసారు. 

ఫామ్ లో వున్న థమన్ సంగీతం అందించారు. లిరిక్స్ భలేగా వున్నాయి. ముఖ్యంగా ..'నో పెళ్లి..దాని తల్లి' అంటూ రాయడం సాహిత్యంలో మరో అడుగు ముందుకు వేసినట్లు అయింది.  పెళ్లి..దానమ్మ అంటే మరీ అసహ్యంగా వుంటుంది. అందుకే పాలిష్ చేసి, నో పెళ్లి..దాని తల్లి అంటే చక్కగా రైమింగ్ కుదిరినట్లు అయింది. పాలిష్ గా రాసినట్లు అయింది. 

దీనివల్ల ఫ్యూచర్ లో '…బాపు బొమ్మ..దీనమ్మ…'అని కూడా రాసుకునే అవకాశం వుంటుంది. అయినా చాన్నాళ్ల కిందట ఓ పాటలో 'నీ సిగదరగ' అనే పదం పదే వినిపించారు. ఆ పదం ఓ తిట్టు అని, 'నీ సిగదరగ' అంటే మీ మొగుడు చనిపోనూ అనే అర్థంలో ఒక్కప్పుడు తిట్టేవారు అని ఎవరికి గుర్తు. చలామణీ అయిపోలా? నీఎంకమ్మ అన్న పదం పాపులర్ అయిపోలా? నీయమ్మ అంటే బూతు..నీ అయ్య అన్నా అంతే బూతు కానీ వాడేయడం లా?

అలాగే దానితల్లి అంటే అదో కొత్త పద ప్రయోగం అనుకోవాలి…సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతున్నందుకు సంతోషించాలి.