ఏడు రోజుల హనీమూన్కు మలేషియా వెళ్లిన నవ దంపతులు…ఊహించని విధంగా రెండునెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. దీనికి కారణం లాక్డౌన్. ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నవరంగపూర్ ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్, ఆయన భార్య పల్లవి నవదంపతులు.
పెళ్లి అయిన తర్వాత ఎన్నో తీయటి కలలతో మలేషియాకు ఊహల రెక్కలు కట్టుకుని ఎగురుతూ వెళ్లారు. మార్చి 21న మలేషి యాలో దిగారు. హనీమూన్ షెడ్యూల్ మార్చి 17వ తేదీ వరకు వేసుకున్నారు. ఆ రోజు తిరిగి భారత్ రావాల్సి ఉంది. అనుకున్న ప్రకారం ఆ కొత్త జంట మార్చి 17వ తేదీ రాత్రి విమానాశ్రయానికి చేరుకుంది. అయితే కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న క్రమంలో, దాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం విదేశాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది.
దీంతో నవదంపతులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు. అయితే మలేషియా ప్రభుత్వం అక్కడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సౌకర్యం కల్పించింది. లాక్డౌన్-4లో భాగంగా విదేశాల్లో ఉన్న ప్రయాణికులను ఇండియాకు తిరిగి రప్పించే కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మలేషియాలో చిక్కుకున్న ఆ జంట కూడా తమ స్వస్థలానికి 68 రోజుల తర్వాత చేరుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు