ఏపీ బీజేపీలో పార్టీ ఫండ్ స్కామ్?

ఇటీవలి ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీ విభాగంలో పార్టీ ఫండ్ స్కామ్ జరిగిందా? ఆ పార్టీ నేతలు ఈ విషయంలో అమిత్ షాకు కూడా కంప్లైంట్ ఇచ్చారా? అనే అంశాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. జాతీయ…

ఇటీవలి ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీ విభాగంలో పార్టీ ఫండ్ స్కామ్ జరిగిందా? ఆ పార్టీ నేతలు ఈ విషయంలో అమిత్ షాకు కూడా కంప్లైంట్ ఇచ్చారా? అనే అంశాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఢిల్లీ నుంచి ఇటీవలి ఎన్నికల సమయంలో వచ్చిన పార్టీ ఫండ్ లో భారీ స్కామ్ చోటు చేసుకుందట. కొంతమంది నేతలు కలిసి ఆ డబ్బును పంచుకున్నారట. వాళ్లు వాళ్లు పంచుకుని పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు తక్కువ మొత్తాన్ని అందించారని కమలం పార్టీలోనే కొంతమంది వాదిస్తున్నారు.

ఈ విషయంలో వారు అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా సమాచారం. మొత్తం ముప్పైకోట్ల రూపాయల మొత్తాన్ని కొంతమంది ముఖ్యనేతలు దోచేశారనే అభియోగాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ  ఏపీకి కూడా పార్ట్  ఫండ్ ను బాగానే ఇచ్చారట. పార్టీ తరఫున ఎవరూ వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫండ్ వచ్చిందట. అయితే ఆ ఫండ్ ను అభ్యర్థులకు అందించడంలో నేతలు కోత వేశారని, మొత్తం ముప్పై కోట్ల రూపాయలను దోచేశారని బీజేపీ వాళ్లు అంటున్నారు.

ఒక్కో జిల్లా స్థాయి నేతకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు అందాయని, అభ్యర్థులకు అందాల్సిన డబ్బును అలా కొంతమంది దోచేశారని టాక్. ఈ విషయంలో అమిత్ షాకు కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరారట. ఎలాగూ గెలిచేది లేదని నేతలే డబ్బును మింగేసినట్టుగా ఉన్నట్టున్నారు. బీజేపీ తరఫున పోటీచేసిన చాలామంది పార్టీ ఫండ్ కోసమే నామినేషన్లు వేశారనేది ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన వాస్తవం!

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..