విజయ్ దేవరకొండకి ఇప్పుడు ద్వితీయశ్రేణి స్టార్లలో అత్యధిక ఫాలోయింగ్ వుంది. గీత గోవిందం తర్వాత తన మార్కెట్‌ని కన్సాలిడేట్ చేసుకునే అవకాశం రాలేదు. ఆ లోటుని డియర్ కామ్రేడ్‌తో తీర్చుకోవాలని చూస్తున్నాడు. అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేసే విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని సక్సెస్ చేసే బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. క్రియేటివ్ ఇంటర్‌ఫియరెన్స్ నుంచి పబ్లిసిటీ వరకు అంతా విజయ్ అదుపాజ్ఞల్లో జరుగుతోంది.
డియర్ కామ్రేడ్ కోసం యువతతో పాటు ఫ్యామిలీస్ కూడా ఎదురు చూస్తున్నారు కానీ విజయ్ తనకి వచ్చిన ఫ్యామిలీ ఫాలోయింగ్‌ని ఖాతరు చేసినట్టు లేడు. డియర్ కామ్రేడ్‌లో లిప్‌లాక్స్ అధికంగా వుండడం వల్ల ఇది కూడా లిమిటెడ్ ఆడియన్స్‌కి పరిమితం అవుతుంది. ఫ్యామిలీస్, కిడ్స్ ఈ చిత్రానికి రాకుండా ట్రెయిలర్‌తోనే కంచె వేసేసినట్టయింది.
ప్రేమకథా చిత్రమైనా, యువతని ఆకట్టుకోవడం ప్రధాన ఉద్దేశం అయినా కానీ ఇలా ఒక వర్గం ప్రేక్షకులకి అభ్యంతరకరంగా సినిమాని మలచాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ బ్యాలెన్స్ పాటించకపోతే, ఇంకా అర్జున్‌రెడ్డిలాంటి సినిమాల మీదే ఫోకస్ పెడతానంటే తన స్థాయిని తానే రిస్ట్రిక్ట్ చేసుకున్నవాడవుతాడు.