హీరోల భార్య‌ల్లో.. ఆమెకున్నంత క్రేజ్ ఎవ్వ‌రికీ లేదు!

సినిమా హీరోల భార్య‌లంటే స‌హ‌జంగానే క్రేజ్ ఉంటుంది. కొంద‌రు హీరోలు ఇండ‌స్ట్రీలోని అమ్మాయిలే పెళ్లి చేసుకుంటారు. మ‌రి కొంద‌రు త‌మ స‌మీప‌బంధువుల అమ్మాయిని, కొంద‌రివి ల‌వ్ స్టోరీలు. హీరోలు హీరోయిన్ల‌ను పెళ్లిళ్లు చేసుకుంటే.. ఆ…

సినిమా హీరోల భార్య‌లంటే స‌హ‌జంగానే క్రేజ్ ఉంటుంది. కొంద‌రు హీరోలు ఇండ‌స్ట్రీలోని అమ్మాయిలే పెళ్లి చేసుకుంటారు. మ‌రి కొంద‌రు త‌మ స‌మీప‌బంధువుల అమ్మాయిని, కొంద‌రివి ల‌వ్ స్టోరీలు. హీరోలు హీరోయిన్ల‌ను పెళ్లిళ్లు చేసుకుంటే.. ఆ జంట అంటే స‌ర్వ‌త్రా క్రేజే. 

అలాగే రాజ‌కీయ నేత‌ల ఇంటి అమ్మాయిల‌ను హీరోలు పెళ్లి చేసుకున్నా, లేదా వ్యాపార‌రంగంలో ఫేమ‌స్ అయిన వారి ఇంటి పిల్ల‌ను పెళ్లి చేసుకున్నా.. వారు కూడా వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇలాంటి భారీ నేప‌థ్యం లేక‌పోయినా, హీరో భార్య‌గా గుర్తింపును పొందిన అనంత‌రం, సొంతంగా వెలిగే వాళ్లు మాత్రం బాగా అరుదు. హీరో భార్య‌గా వ‌చ్చిన గుర్తింపు క‌న్నా.. ఆ హీరోనే ఆమె భ‌ర్త అనేంత సంద‌ర్భాలు బాగా త‌క్కువ‌!

హృతిక్ రోష‌న్ భార్య సుసాన్ కు ఇలాంటి గుర్తింపు ఉండేది. ఆమెది కాస్త సినీ నేప‌థ్య‌మే. ఆమె తండ్రి న‌టుడు, ద‌ర్శ‌కుడు. అయితే ఆ సినీ గుర్తింపు క‌న్నా హృతిక్ భార్య‌గా ఆమెకు ఎక్కువ గుర్తింపును ఇచ్చింది. హృతిక్ తో విడాకుల అనంత‌రం కూడా సుసాన్ తెర‌మ‌రుగు కాలేదు. సొంతంగా కూడా సుసాన్ కు మంచి గుర్తింపు ఉంది. దాన్ని ఆమె క‌మ‌ర్షియ‌ల్ గా వాడుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు కానీ, సుసాన్ ప్ర‌త్యేక‌మే!

ఇక క‌రీనా క‌పూర్, విద్యా బాల‌న్ వంటి వాళ్ల‌తో వ్య‌వ‌హారాలు సాగించాడ‌నే పేరున్న షాహిద్ క‌పూర్ ను వారి విష‌యంలో ఏమో కానీ అత‌డి భార్య‌ను చూసి జ‌లాసీలు ఉంటాయి కాబోలు. మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు షాహిద్. అప్ప‌టి నుంచి హీరోగా అత‌డి కెరీర్ పీక్ స్టేజీకి చేరింది. సినీ నేప‌థ్యం లేని అమ్మాయిలెవ‌రైనా బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకున్నాకా.. మీరా రేంజ్ లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించ‌డం గ‌త ద‌శాబ్దాల్లోనే జ‌రిగి ఉండ‌దు!

మీరా రాజ్ పుత్ అంటే.. బాలీవుడ్ హీరోయిన్ల‌కు మించిన క్రేజ్ ఉంది మీడియాలో. ఆమె గురించి రాయ‌డానికి ఉత్సాహం ఉంటుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే షాహిద్ క్రేజ్ ను మీరా నే కొంత పెంచింది. ఇక యాడ్ మార్కెట్ లో కూడా మీరాకు అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. ఆమె చేత ర‌క‌ర‌కాల యాడ్స్ చేయిస్తున్నారు. 

బ్యూటీ ప్రోడ‌క్ట్స్ యాడ్స్ తో స‌హా.. టీవీల యాడ్ లో కూడా మీరా ఫొటోలు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇలా బ్రాండ్ ప్ర‌మోట‌ర్ స్థాయి కి ఎదిగిన హీరోల భార్య‌లెవ‌రూ లేరేమో! ఏ హీరోయిన్లో హీరోని పెళ్లి చేసుకుని త‌మ బ్రాండ్ వ్యాల్యూను పెంచుకుని ఉండ‌వ‌చ్చు గాక‌, సినీ నేప‌థ్యం లేకుండా హీరో భార్య‌గా మారి ఓన్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో మీరానే సో స్పెష‌ల్!