ఎక్స్ క్లూజివ్ – బాలయ్య-పవన్-త్రివిక్రమ్

బాలయ్య-పవన్-త్రివిక్రమ్ అన్న పేర్లు మూడూ వరుసగా పక్క పక్కన కనిపిస్తే చాలు. ఆ కిక్కే వేరుగా వుంటుంది. అయితే ఆ కాంబినేషన్ లో సినిమా అన్నది అంత సులువుగా పాజిబుల్ కాదు.  Advertisement అసలు…

బాలయ్య-పవన్-త్రివిక్రమ్ అన్న పేర్లు మూడూ వరుసగా పక్క పక్కన కనిపిస్తే చాలు. ఆ కిక్కే వేరుగా వుంటుంది. అయితే ఆ కాంబినేషన్ లో సినిమా అన్నది అంత సులువుగా పాజిబుల్ కాదు. 

అసలు పాజిబుల్ అవుతుందని అనుకోవడానికే లేదు. కానీ ఇదే కాంబినేషన్ ను మరో విధంగా సెట్ చేయడానికి ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి.

బాలయ్య హిట్ చాట్ షో అన్ స్టాపబుల్ సెకెండ్ సీజ‌న్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సరైన గెస్ట్ లు కావాలి. అందుకోసం వెదుకులాట ప్రారంభమైంది. అన్ స్టాపబుల్ రెండో సీజ‌న్ ను సరైన కాంబినేషన్ తో ప్రారంభించడానికి చూస్తున్నారు. 

అందులో కీలకంగా అనుకుంటున్నది పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్. వీళ్లిద్దరిని అన్ స్టాపబుల్ షో కి తీసుకువస్తే, వాళ్లతో బాలయ్య ముచ్చట్లు పెడితే అది ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఈ ప్రపోజ‌ల్ కు పవన్-త్రివిక్రమ్ సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ఫైనల్ కన్ సెంట్ ఇవ్వాల్సి వుంది. అది ఇస్తే ఇంక షూటింగ్ నే. ఈ నెల 26 నుంచి వారం రోజులు అన్ స్టాపబుల్ సెట్ మీదకు బాలయ్య వస్తున్నారు. దీనికి ఓపెనింగ్ షాట్ ను దుబాయ్ లో లేదా టర్కీలో చిత్రీకరించే అవకాశం వుంది.