ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్‌గా జపాన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచారు. సంపాదనలో అమెరికన్ దిగ్గజం సెరీనా విలియమ్స్‌ను ఆమె అధిగమించారు. గత 12 నెలల కాలంలో సంపాదనను పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ మ్యాగ్జీన్ వంద మంది అథ్లెట్స్‌తో ఓ జాబితా తయారు చేసింది. జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.
మహిళా అథ్లెట్లలో మాత్రం ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఒసాకా రూ.284.20 కోట్లతో (37.4 మిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఎండార్సుమెంట్లు, ప్రైజ్‌మనీ రూపంలో సెరెనా కంటే నవోమి ఒసాకా రూ.10.64 కోట్లు (1.4 మిలియన్ డాలర్లు) ఎక్కువ సంపాదించి రికార్డు సృష్టించింది.
22 ఏండ్ల ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందింది. ఇప్పటి వరకు రష్యా క్రీడాకారిణి షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె చెరిపివేశారు. షరపోవా 2015లో 29.7 మిలియన్ డాలర్లు సంపాదించింది. కాగా ఒసాకాకు మూడేళ్ల వయసున్నప్పుడు, ఆమె కుటుంబం తన తండ్రి తల్లిదండ్రులతో కలిసి ఉపాధి కోసం జపాన్ నుండి న్యూయార్క్‌లోని వ్యాలీ స్ట్రీమ్‌కు వెళ్లారు. 1999 ఫ్రెంచ్ ఓపెన్‌లో విలియమ్స్ సోదరీమణులు పోటీ పడటం చూసి ఒసాకా తండ్రి తన కుమార్తెలకు టెన్నిస్ ఎలా ఆడాలో నేర్పించారు. ఒసాకా అమెరికాలో పెరిగినప్పటికీ, వారి తల్లిదండ్రులు తమ కుమార్తెలు జపాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్ణయించుకున్నారు.