కర్ణాటక.. క్లైమాక్స్ లో మలుపులుంటాయా?

అసెంబ్లీలోని 15 మంది సభ్యులు రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టుగా, తాము సభకు హాజరయ్యే ప్రసక్తే లేనట్టుగా ప్రకటించారు. వారి రాజీనామాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు ఆదేశించకపోయినా.. తాము సభకు అయితే హాజరుకావడం లేదని వారు ప్రకటించారు.…

అసెంబ్లీలోని 15 మంది సభ్యులు రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టుగా, తాము సభకు హాజరయ్యే ప్రసక్తే లేనట్టుగా ప్రకటించారు. వారి రాజీనామాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు ఆదేశించకపోయినా.. తాము సభకు అయితే హాజరుకావడం లేదని వారు ప్రకటించారు. దీంతో కర్ణాటకలోని సంకీర్ణ సర్కారు బలం తగ్గిపోయింది. కోర్టు తీర్పు అలా వచ్చిందో లేదో ఈరోజు కుమారస్వామి సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది.

ప్రస్తుతానికి కుమారకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు నూటా ఐదుమంది. సభలో బలాబలాలను బట్టి ప్రభుత్వం పడిపోకుండా ఉండాలంటే 106 మంది ఎమ్మెల్యేలు కావాలి. మరి ఆ ఒక్క ఎమ్మెల్యేనీ ఎలాగోలా సంపాదించుకుంటే.. కుమారస్వామి సర్కారు గండం నుంచి గట్టెక్కినట్టే.

అయితే బీజేపీ వద్ద నూటా ఏడు మంది ఎమ్మెల్యేలున్నారు. ఇలాచూస్తే  కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోతున్నట్టే. గురువారం కర్ణాటకలో ఈ వ్యవహారానికి అసెంబ్లీలో క్లైమాక్స్ ఉండబోతున్నట్టే. అయితే  అనూహ్యమైన పరిణామాలు సంభవిస్తాయా? క్లైమాక్స్ లో ఏవైనా ట్విస్టులు ఉంటాయా? లేక  మరో మలుపులేకుండా సంకీర్ణ సర్కారు కూలిపోతుందా? అనేవి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అంశాలు.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి