హీరోల్లో హీరోయిజం ఇంతేనా?

తమ సినిమా థియేటర్లోనే విడుదల కావాలి. తమ స్టామినా తెలిసి దానికి అనుగుణంగా తమ తమ పారితోషికాలు పెంచుకోవాలి. ఓటిటికి ఇస్తాం అంటే అడ్డంగా పడిపోతాం. ఇదీ మన హీరోల వ్యవహారం.  Advertisement కానీ…

తమ సినిమా థియేటర్లోనే విడుదల కావాలి. తమ స్టామినా తెలిసి దానికి అనుగుణంగా తమ తమ పారితోషికాలు పెంచుకోవాలి. ఓటిటికి ఇస్తాం అంటే అడ్డంగా పడిపోతాం. ఇదీ మన హీరోల వ్యవహారం. 

కానీ ఆ ధియేటర్ వ్యవస్థను కాపాడడానికి మాత్రం తమ వంతు ప్రయత్నం వన్ పర్సంట్ కూడా చేయరు. ఎవరైనా ప్రయత్నం చేసినా మద్దతు ప్రకటించరు. ఇదీ మన దౌర్భాగ్యం. 

థియేటర్ల టికెట్ ల రేట్లు, యాభై శాతం ఆక్యుపెన్సీ, ఇతరత్రా వ్యవహారాలపై హీరో నాని కుండ బద్దలు కొట్టినట్లు తిమ్మరసు సినిమా వేదికపై మాట్లాడారు. ప్రతి ఒక్కరి చేత శహభాష్ అనిపించుకున్నారు. ఇలా మాట్లాడే ధైర్యం మరే హీరో చేయలేకపోయారు. పోనీ అలా మాట్లాడిన నానికి మద్దతు కూడా ప్రకటించలేకపోయారు. 

కనీసం నాని ప్రసంగం విడియోను ట్వీట్ చేయలేకపోయారు. హీరోలు అందరికీ థియేటర్లు కావాలి. కానీ సమస్య మాత్రం తమది కాదు థియేటర్ల జనాలది అన్నట్లు వుంది వ్యవహారం. టాలీవుడ్ లో పొలిటికల్ టచ్ వున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆయన స్వంతం. 

కనీసం ఆయనయినా థియేటర్ల తరపున పోరాటానికి దిగలేదు. అసలు సమస్య ఆయన సినిమాతోనే ప్రారంభమైందని ఆయనకు తెలుసు. మరి అలాంటపుడు ఆయన ముందు వుండి థియేటర్ల తరపున పోరాటం సాగించకపోతే మరేం హీరోయిజం అనిపించుకుంటుంది. 

తెలుగు నాట హీరోలు అంతా రెమ్యూనిరేషన్ కోసం తప్ప, రిస్క్ చేయడానికి కాదు అనే కామెంట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.