ప్రమాదం అనేది ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో.. సికింద్రాబాద్ లోని ఒక ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ భారీ ఆగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏడుగురు మరణించడంతో పాటు పలువురు పరిస్ధితి సీరియస్ గా ఉంది. కింద సెల్లార్ లో బైక్ షోరూమ్ పైన లాడ్జి ఉండటంతో షోరూంలో జరిగిన ఆగ్ని ప్రమాదం వలన చేలరేగిన మంటలు, పొగ లాడ్జిలోకి వ్యాపించడంతో ఊపిరాడక ప్రమాదం జరిగింది.
అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇ-ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో బ్యాటరీ బ్లాస్ట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందే తెలిసేలోపే బాంబుల్లా పేలాయి బ్యాటరీలు. దట్టమైన పొగ కమ్మేయడంతో లాడ్జ్‌లో ఉన్న దాదాపు పాతికమంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారు దాదాపు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. బతుకు దేరువు కొసం హైదరబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
లాడ్జిలో ఉన్న చాలామంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీల నుంచి కిందకు దూకారు. మరి కొంత మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
నాలుగు అంతస్థులో లాడ్జి. టూరిస్టులు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఒక్కటే మార్గం. పక్కనే ఇరుకుగా మెట్లమార్గం ఉన్నా.. లాడ్జికి వచ్చిన టూరిస్టులకు దాని గురించి తెలియదట. అదే పలువురి ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణమైందంటూన్నారు స్ధానికులు.