విజయం ఆస్వాదించినంత సులువు కాదు అపజయాన్ని అంగీరించడం. సర్రున సక్సెస్ ను అందుకున్న ఓ యంగ్ హీరో ఇటీవల తగిలిన ఫెయిల్యూర్ షాక్ ను తట్టకోలేకపోతున్నాడట. ఆ షాక్ తో ఇంటికే పరిమితం అయిపోయాడట.
ఎంత చెప్పినా ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ కు హాజరు కాను కాక కాను అని హఠం వేసుకున్నాడని తెలుస్తోంది. మంచి ఈవెంట్ అని, అవార్డు అని రావాలని నిర్మాత, దర్శకుడు ఇలా ఎందరు చెప్పినా రాను కాక రాను అని ఇంటికే పరిమితం అయిపోయాడట.
గమ్మత్తేమిటంటే ఆ ఫెయిల్యూర్ సినిమా కథను ఈ యంగ్ హీరో బాగా నమ్మాడు. ఆ కథ మరో ఒకరిద్దరు హీరోల దగ్గరకు వెళ్లి రిటర్న్ అయిందని తెలిసీ ఒకె చేసాడు. అలా ఓకె చేయడంలో కూడా ఆ హీరో దగ్గర వుండే సన్నిహితుల ప్రభావం కూడా బాగా వుందట. ఇన్ని జరిగి, ఆ సినిమా చేసాక, అది ఫెయిల్ కావడంతో ఇప్పుడు చాలా బాధలో వున్నాడని తెలుస్తోంది.
ఈ హీరో కొత్త సినిమా ఈ పాటికే స్టార్ట్ కావాల్సి వుంది. ఈ నెల రెండో వారంలో ఆ ప్రాజెక్టు ప్రారంభం అయితే మళ్లీ మామూలు మూడ్ లోకి వస్తాడేమో హీరో.