బాబు బాధ.. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ నవ్వు!

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వారంటే కొంతమందికి ముచ్చట. నవ్వుతూ కనిపించే వారిని చాలామంది అభినందిస్తూ ఉంటారు కూడా. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా… అవతల వాళ్లు నవ్వుతూ, అహ్లాదంగా కనిపించడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టరు.…

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వారంటే కొంతమందికి ముచ్చట. నవ్వుతూ కనిపించే వారిని చాలామంది అభినందిస్తూ ఉంటారు కూడా. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా… అవతల వాళ్లు నవ్వుతూ, అహ్లాదంగా కనిపించడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టరు. నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ మాట్లాడటం గొప్ప వరమని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. 'నవ్వడం ఒకయోగం..' అని కూడా మన ప్రాచీనులు తేల్చిచెప్పారు.

మరి అవతల వాళ్లలాగా నవ్వలేకపోతే నవ్వలేకపోయాం కానీ.. వారు నవ్వుతున్నారని మాత్రం ఎవ్వరూ ఏడవరు! తమకు నచ్చనివారు అయినా నవ్వుతున్నారని ఎవరూ బాధపడరు. కానీ… ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు ఇది కొత్త ఏమీకాదు. గతం లో కూడా ఆయన ఇదేతీరున ప్రవర్తించారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఆయన ఒక్కోసారి నవ్వుకునేవారు. వారి ఆరోపణలు అర్థరహితం అనే విషయాన్ని వైఎస్ తన నవ్వుతోనే సమాధానం ఇచ్చేవారు. అయితే ఆ నవ్వును అప్పుడు చంద్రబాబు నాయుడు సహించలేకపోయేవారు. ఆ విషయంలో స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడేవారు. 'ఆయన నవ్వుతున్నారు అధ్యక్ష..' అంటూ చంద్రబాబు నాయుడు స్పీకర్ కు కంప్లైంట్ ఇచ్చేవాళ్లు, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మొహమంతా చాలా సీరియస్ గా పెట్టేవారు.

ఇక వైఎస్ విషయంలోనే కాదు ఆయన తనయుడి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే కంప్లైంట్ చేశారు. సీఎం స్థానంలో ఇప్పుడు వైఎస్ తనయుడు కూర్చున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఆ పార్టీ చేసే ఆరోపణలకు, చేసే వాదనలకు జగన్ కూడా నవ్వుతూ స్పందిస్తున్నారు. ఇంకేముంది.. చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలే! జగన్ మీద చంద్రబాబు నాయుడు మళ్లీ పాత మాటలే మాట్లాడుతున్నారు.

'నవ్వుతున్నారు అధ్యక్ష.. ఎందుకు నవ్వుతున్నారో..' అంటూ చంద్రబాబు నాయుడు మొహమంతా అదోలా పెట్టి వాపోతున్నారు. మొత్తానికి అప్పుడు వైఎస్ నవ్వునూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో భరించలేకపోయారు. ఇప్పుడు జగన్ నవ్వునూ సహించలేకపోతున్నారు!

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?