మత్తు డాక్టర్ పచ్చ పార్టీ ఫ్యానేనట?

ఆయన మత్తు డాక్టర్. ఓ మామూలు వైద్యుడు. కానీ ఆయన్ని ముందు పెట్టి  పచ్చ రాజకీయం చేయడంతో ఇపుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఇంతకీ ఈ మత్తు డాక్టర్ ఎవరో కాదు, నర్శీపట్నంలో ఎనస్తీషియా…

ఆయన మత్తు డాక్టర్. ఓ మామూలు వైద్యుడు. కానీ ఆయన్ని ముందు పెట్టి  పచ్చ రాజకీయం చేయడంతో ఇపుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఇంతకీ ఈ మత్తు డాక్టర్ ఎవరో కాదు, నర్శీపట్నంలో ఎనస్తీషియా విభాగానికి చెందిన వారు. ఆయన వ్రుత్తి వైద్యుడు అయినా ఆయనకూ ఇష్టాలు ఉంటాయి. కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారని చెబుతున్నారు.

అంతే కాదు, విశాఖ జిల్లాలోని పాయకరావుపేటలోని అసెంబ్లీ సీటు నుంచి 2019  పోటీ చేయాలని కూడా ఆయన భావించారుట. అందులో భాగంగా ఆయన తన ఉద్యోగానికి అప్పట్లోనే రాజీనామా ఇచ్చేసి తెలుగుదేశం టికెట్ కోసం దరఖాస్తు చేశారట.

అయితే టికెట్ రాకపోవడంతో ఆయన రాజీనామాను వైద్య విధాన పరిషత్ ఆమోదించలేదని అంటున్నారు. అంటే ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన వచ్చిందని అంటే ఆ పార్టీ నేతలతో  సఖ్యత ఉన్నట్లే అనుకోవాలిగా.

ఈ వివరాలను బయటపెట్టిన నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మత్తు డాక్ట‌ర్ సుధాకర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సన్నిహితుడు అని కూడా చెప్పారు. ఆ విధంగా ఆయన తెలుగుదేశం రాజకీయాల పట్ల కూడా అభిమానం పెంచుకున్నారని చెబుత్న్నారు.

ఇక విశాఖలో మత్తు డాక్టర్ ప్రవర్తించిన తీరు వల్లనే ఆయన్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఆయన డాక్టర్ సుధాకర్ అని కూడా పోలీసులు ఎవరికీ తెలియదు, ఇక రాజకీయ  కక్ష ఏముంటుంది అని కూడా అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు రాజకీయం కోసం  వాడకం ఈ రేంజిలో ఉంటుందని, అందువల్లనే డాక్టర్ చదువు, హోదా అన్నీ కూడా గంగపాలు చేసేలా పచ్చ పార్టీ ఆయన్ని నడిబజారులో పెట్టి మరీ తమ రాజకీయ దాహం తీర్చుకుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేస్తున్న సెటైర్లు వేశారు. మొత్తానికి కొందరి  రాజకీయానికే డాక్టర్ బలి అవుతున్నారన్నది కూడా ఇపుడు గట్టిగా వినిపిస్తున్న మాట. 

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం