3 రాజధానులు పక్కా: కొడాలి నాని

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు నిన్న జ‌రిగిన అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ పై చేసిన విమ‌ర్శ‌ల‌పై త‌న‌దైనా శైలిలో గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు మాజీ మంత్రి,…

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు నిన్న జ‌రిగిన అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ పై చేసిన విమ‌ర్శ‌ల‌పై త‌న‌దైనా శైలిలో గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. అస‌లు అమ‌రావ‌తి రైతులకు వెన్నుపోటు పొడిచింది చంద్ర‌బాబేన‌న్నారు.

చంద్ర‌బాబు వెన్నుపోటు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని.. నిసిగ్గుగా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు.. హైద‌రాబాద్ ను నిర్మించానని చెప్పుకొవ‌డం సిగ్గు చేట్ట‌న్నారు. వినేవాడు ఉంటే చంద్ర‌బాబు ఏదైనా చెబుతార‌ని అందుకే భ్ర‌మ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు గ్రాఫిక్స్ చూపించి అమ‌రావ‌తి రైతుల‌ను మ‌భ్య‌పెట్టరాన‌న్నారు.

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను అనాధ‌ల్లా వ‌దిలేసి అమ‌రావ‌తిలోనే రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెడితే మిగ‌త ప్ర‌జ‌లకు అన్యాయం జ‌రుగుతున్నారు. మూడు రాజ‌ధానుల‌ను గుంటూరు, కృష్ణ జిల్లాల ప్ర‌జ‌లు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నారు, కేవ‌లం ఆ 29 గ్రామాలో త‌న బినామి భూముల‌ కోసం మాత్ర‌మే చంద్ర‌బాబు అమ‌రావ‌తి పేరుతో రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో కానీ లేదా వ‌చ్చే స‌మావేశాల్లో కాని మూడు రాజ‌ధానుల బిల్లు పెట్టి, ముందే చెప్పినట్లగానే విశాఖ రాజ‌ధాని ఏర్పాటు చేస్తామ‌న్నారు కొడాలి నాని. వ‌చ్చే ఎన్నిక‌ల‌ల్లో చంద్ర‌బాబు కు కూడా మంగ‌ళ‌గిరిలో లోకేష్ కు ప‌ట్టిన గ‌తే కుప్పంలో బాబుకు కూడా ప‌డుతుంద‌ని, తండ్రి, కొడుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేర‌ని కొడాలి జోస్యం చెప్పారు.