కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది అంతా తనదయే అని ఆ మధ్య గట్టిగానే చెప్పుకున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటూ పోటీచేసిన కాంగ్రెస్-జేడీఎస్ ల పొత్తుకు తనే ఐడియా ఇచ్చినట్టుగా అప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకున్నారు. బీజేపీ అక్కడ గద్దెనెక్కకూడదంటూ తనే ఆ రెండు పార్టీలనూ కలిపినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు.
మరి ఇప్పుడు ఆ ప్రభుత్వమే ఇరకాటంలో పడిపోయింది. కూలిపోయే దశలో ఉంది. చంద్రబాబు నాయుడు స్పందించరేం! తను ఏర్పాటు చేయించిన ప్రభుత్వం కూలిపోతుంటే కాపాడరేం! ఇప్పుడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాలి కదా. ఆ ప్రభుత్వ ఏర్పాటే తన ఘనత అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు అదే ప్రభుత్వం కూలిపోతుంటూ చూస్తూ ఊరుకోవడం ఏమిటో!
ఆ ప్రభుత్వాన్ని కాపాడటానికి చక్రం తిప్పాలి కదా! కాంగ్రెస్ నేతలను, జేడీఎస్ నేతలను పిలిపించుకుని మాట్లాడి చంద్రబాబు సర్ధిచెప్పాలి కదా! అలిగిన ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించి కుమారస్వామి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కాపాడాలి కదా! ఇలాంటి పనులు చంద్రబాబు చేయరా? అవకాశం వస్తే డబ్బా కొట్టుకోవడం మాత్రమే చేస్తారా!
అందులోనూ చంద్రబాబు నాయుడు ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారు దేవేగౌడ! ఆ మాటకు అప్పట్లో చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు కదా! అలా తనను మునగమాను ఎక్కించినందుకు అయినా దేవేగౌడ తనయుడి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కాపాడటానికి బెంగళూరు వెళ్లరేం!