దుష్ట‌చ‌తుష్ట‌యంపై ఉతుకుడు స్టార్ట్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆదేశించ‌డ‌మే ఆల‌స్యం. దుష్ట‌చ‌తుష్ట‌యంపై చాకిరేవు మొద‌లైంది. ప్ర‌భుత్వంతో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియాను ఊరికే వ‌దిలి పెట్టొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆదేశించ‌డ‌మే ఆల‌స్యం. దుష్ట‌చ‌తుష్ట‌యంపై చాకిరేవు మొద‌లైంది. ప్ర‌భుత్వంతో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియాను ఊరికే వ‌దిలి పెట్టొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సీఆర్‌డీఏ చ‌ట్ట స‌వ‌ర‌ణకు కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌డంపై ఎల్లో మీడియా వ‌క్ర‌భాష్యం చెబుతూ బ్యాన‌ర్ క‌థ‌నాల‌ను ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే.  

ఈ క‌థ‌నాల‌ను ప‌ట్టుకుని మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఓ రేంజ్‌లో చాకిరేవు పెట్టారు. నాని కొడితే ఎలా వుంటుందో, దెబ్బ తిన్న వాళ్ల‌కే త‌ప్ప‌, కొట్టిన వాళ్ల‌కు తెలియ‌దు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి అధిప‌తులు రామోజీరావు, రాధాకృష్ణ‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుల‌పై పేర్ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పేర్ని ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“రాష్ట్రంలో నిరుపేద‌ల‌కు రాజ‌ధానిలో ఇంటి స్థ‌లాలు ఇవ్వ‌కూడ‌ద‌ట‌. ఇస్తే సామాజిక స‌మ‌తుల్య‌త దెబ్బతింటుంద‌ట‌. చంద్ర‌బాబు ప్రేర‌ణ‌తో కోర్టులో వ్యాజ్యం వేశారు. “న‌వ‌ర‌త్నాలు, పేద‌లంద‌రికీ ఇల్లు ప‌థ‌కం కింద రాజ‌ధాని బ‌య‌టి ప్రాంతానికి చెందిన వారికి ఇళ్ల స్థ‌లాలు కేటాయించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని గ‌తంలో హైకోర్టు నిలిపివేయ‌బ‌డింది. ప్ర‌భుత్వం త‌న పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్‌డీఏ చ‌ట్టాన్ని స‌వ‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది” అని ఈనాడులో రాసారు.

ఏం భాష‌రా బాబు దేవుడా. అస‌లు మొత్తం విష‌పు రాతంతా కూడా మీ కోస‌మే క‌నిపెట్టిన‌ట్టు! అది కూడా జ‌గ‌న్ మీద విషం చిమ్మ‌డానికే ఈ భాష‌ను క‌నిపెట్టారా? జ‌గ‌న్ మీద విషం చిమ్మ‌డానికే పేప‌ర్ న‌డుపుతున్న‌ట్టుంది వ్య‌వ‌హారం. సొమ్ము జ‌నానిది, లాభ‌మేమో మీ ముగ్గురిది. ఇదే చంద్ర‌బాబు స్థ‌లాలిస్తే మాత్రం మీకు స‌మ్మ‌గా ఉంటుందా? జ‌గ‌న్ ఇస్తే మాత్రం న‌చ్చ‌దు. రాజ‌ధానిలో ఎవ‌రుండాలి? మ‌నుషులుండ‌రా? మ‌నుషులు లేకుండా ఎవ‌రుండాల‌ని ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ , చంద్ర‌బాబు ప్లాన్ చేశారు?

ఇన్ని వేల ఎక‌రాలు తీసుకుని ఏం చేద్దామ‌ని? చంద్ర‌బాబు అమ్మొచ్చు…నేను అమ్ముదామ‌ని అనుకున్నాన‌ని నోటిఫికేష‌న్ ఇచ్చాడు. అది త‌ప్పులేదు. అప్పుడు మ‌న‌కు (రామోజీ, రాధాకృష్ణ‌) స‌మ్మ‌గా ఉంది. బ‌య‌టోళ్ల‌కు భూములిచ్చారు. అప్పుడూ స‌మ్మ‌గా వుంది.

దుష్ట‌చ‌తుష్ట‌యం దృష్టిలో రాజ‌ధానిలో పేదాబిక్కీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలెవ‌రూ ఉండ‌డానికి అర్హ‌త లేదు. ఇక్క‌డికి ఎవ‌రూ రాకూడ‌దు. మ‌నం, మ‌న మ‌నుషులే వుండాలి. లేదా బాగా డ‌బ్బున్న వ్యాపారులు రావాలి. పేద‌లొస్తే ఆస్తుల విలువ ప‌డిపోతా య‌న‌డం ఎంత దుర్మార్గమైన మ‌న‌స్త‌త్వం. ఎంత కిరాత‌క‌మైన మ‌న‌స్త‌త్వం. 

రాజ‌ధానికి భూములిచ్చి త్యాగం చేశామంటున్నారు. ఏం త్యాగం చేశారు? రియ‌ల్ ఎస్టేట్‌కు భూములివ్వ‌డం త్యాగ‌మా? కొత్త‌కొత్త సుభాషితాలు. రామోజీరావు, రాధాకృష్ణ‌, చంద్ర‌బాబు క‌లిసి కొత్త డిక్ష‌న‌రీ త‌యారు చేస్తారు. వీళ్లిచ్చే డిక్ష‌న‌రీలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి త్యాగం అనే అర్థం వుంటుంది అని” నాని తీవ్ర‌స్థాయిలో దుమ్ము దులిపారు. ఇంకా అనేక విష‌యాల‌ను నాని ప్ర‌స్తావిస్తూ దుష్ట‌చ‌తుష్ట‌యం ప‌ని ప‌ట్టారు. ఇది రానున్న‌ రోజుల్లో మ‌రింత పెరిగే అవ‌కాశం వుంది.