కర్ణాటకకు కొత్త సీఎం ఖాయమా?

ఈ నాటకాన్ని అంతా కర్ణాటక కాంగ్రెస్ నేతలే ఆడిస్తున్నారని జేడీఎస్ వాళ్లు బలంగా నమ్ముతూ ఉన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి మళ్లీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నంలో ఉన్నారని, అందుకే తమ వారిని కొందిరిని…

ఈ నాటకాన్ని అంతా కర్ణాటక కాంగ్రెస్ నేతలే ఆడిస్తున్నారని జేడీఎస్ వాళ్లు బలంగా నమ్ముతూ ఉన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి మళ్లీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నంలో ఉన్నారని, అందుకే తమ వారిని కొందిరిని వ్యూహాత్మకంగా రాజీనామా అంటూ దాచి పెట్టారనే అభియోగాలు వినిపిస్తున్నాయి సిద్దూపై. 

అయితే సిద్ధరామయ్య మాత్రం తనకే పాపం తెలియదని చెబుతున్నారు. వాళ్లు తనమాట కూడా వినడంలేదని తేలుస్తున్నాడు. మరోవైపు రాజీనామాలు ఇచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం పద్నాలుగుగా తేలింది.
అయితే ఆ రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆమోదించే అవకాశాలు లేవు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ ఎమ్మెల్యేలు ఎంత అరిచి గీపెట్టినా స్పీకర్ వాటి విషయంలో నాన్చవచ్చు.

ఆ లోపు వారికి సర్ధిచెప్పే అవకాశాలున్నాయి. అయితే బీజేపీ ఊరికే ఉండకపోవచ్చు. అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఎమ్మెల్యేలు దారికి రాకపోతే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయి.

అయితే ఇప్పుడు వెళ్లిన వారంతా కేవలం ముఖ్యమంత్రి మార్పుకోసం పట్టు పట్టనున్నారని, ఎవరైనా కాంగ్రెస్ నేతకు వీలైతే సిద్దరామయ్యకే మళ్లీ సీఎం పోస్టు ఇవ్వాలని వారు అంటున్నారు.

కొందరైతే రామలింగారెడ్డికి ఆ అవకాశం ఇవ్వాలని కూడా అంటున్నారట. కుమారస్వామి పీఠాన్ని వదులుకునేందుకు ఇష్టపడతారా? అనేది కొశ్చన్ మార్క్. అయితే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్లి బీజేపీతో కలవలేడు. కాబట్టి ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాటుకు సై అనొచ్చు. ఏతావాతా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించేందుకు కాంగ్రెస్ –జేడీఎస్ లు తర్జనభర్జనలు పడుతూ ఉన్నాయి.

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు