గ్యాసిప్ లు నిజం చేస్తున్న త్రివిక్రమ్

మైత్రీ మూవీస్ కు దర్శకుడు త్రివిక్రమ్ కు మధ్య చెడింది. ఇది లాంగ్ బ్యాక్ న్యూస్. తీసుకున్న అడ్వాన్స్ కు సినిమా చేయాల్సి వుంది. అలా చేయలేదు. అడ్వాన్స్ వెనక్కు ఇచ్చినపుడు వడ్డీ అడిగారు.…

మైత్రీ మూవీస్ కు దర్శకుడు త్రివిక్రమ్ కు మధ్య చెడింది. ఇది లాంగ్ బ్యాక్ న్యూస్. తీసుకున్న అడ్వాన్స్ కు సినిమా చేయాల్సి వుంది. అలా చేయలేదు. అడ్వాన్స్ వెనక్కు ఇచ్చినపుడు వడ్డీ అడిగారు. ఇవ్వడం ధర్మం కూడా. కానీ అలా ఇచ్చిన దగ్గర నుంచి మైత్రీ మీద త్రివిక్రమ్ పగ బట్టేసారన్నది గ్యాసిప్. అందుకే పవన్-హరీష్ శంకర్ సినిమా ఎంతకూ ఒకె కావడం లేదన్నది ఆ గ్యాసిప్ కొనసాగింపు. ఇన్నాళ్లు అది నిజమా కాదా అని అనుకుంటూనే వున్నారు అంతా.

మరోపక్కన మైత్రీ సినిమా అలా వుండగానే త్రివిక్రమ్ తన స్వంత బ్యానర్ ను పీపుల్స్ మీడీయాకు జోడించి 'వినోదహితం' రీమేక్ కు ప్రణాళిక రచిస్తున్నారు. దగ్గర వుండి స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారు. స్టార్ట్ కాస్ట్ అంతా ఆయనే చూసుకుంటున్నారు. పోనీ ఆ తరువాత అయినా మైత్రీ సినిమా వుంటుందా అంటే దర్శకుడు 'సుజిత్' ను త్రివిక్రమ్ దగ్గరకు తీసారు అన్న వార్తలు వినిపించడం ప్రారంభమైంది.

సుజిత్ రెగ్యులర్ గా త్రివిక్రమ్ తో టచ్ లో వుంటున్నారని, దానయ్యతో కలిసి 'తెరి' సినిమా రీమేక్ చేస్తారని వార్తలు ఎప్పుడో ఏనాడో బయటకు వచ్చాయి. ఇప్పుడు దానయ్య బ్యానర్ కు త్రివిక్రమ్ స్వంత బ్యానర్ తోడవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే పవన్ తో రెండో సినిమా అన్నమాట త్రివిక్రమ్ స్వంత బ్యానర్ కు.

ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? మైత్రీ-పవన్-హరీష్ సినిమా అలా పడి వుండడం వెనుక త్రివిక్రమ్ హస్తం వుందన్న వార్తలు నిజం అనుకోరా? త్రివిక్రమ్ తనకు పవన్ తో వున్న స్నేహాన్ని ఇలా వాడేసుకుంటున్నారు అనుకోరా? ఏమో? ఆయనకే తెలియాలి.

అవును ఇంతకీ హరీష్..మైత్రీ సంగతి ఏమిటో?