ఆ హీరోయిన్ పెళ్లికి ఈ హీరోయిన్ కు ఆహ్వ‌నం రాలేద‌ట‌!

కొత్త సినిమాల గురించి క‌బుర్లు చెప్ప‌డానికి ఏమీ లేని నేప‌థ్యంలో.. బాలీవుడ్ మీడియా పాత ర‌చ్చ‌లను తెర మీద‌కు తెస్తూ ఉంది. ద‌శాబ్దాల కింద‌టి సంగ‌తుల‌ను కూడా చ‌ర్చ‌కు పెట్టి.. వాళ్ల‌కూ, వీళ్ల‌కూ ఉన్న…

కొత్త సినిమాల గురించి క‌బుర్లు చెప్ప‌డానికి ఏమీ లేని నేప‌థ్యంలో.. బాలీవుడ్ మీడియా పాత ర‌చ్చ‌లను తెర మీద‌కు తెస్తూ ఉంది. ద‌శాబ్దాల కింద‌టి సంగ‌తుల‌ను కూడా చ‌ర్చ‌కు పెట్టి.. వాళ్ల‌కూ, వీళ్ల‌కూ ఉన్న పాత గొడ‌వ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఉంది. ఇందులో స‌హ‌జంగానే పుకార్ల గురించినే చ‌ర్చ సాగుతూ ఉంది.

అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య‌రాయ్ పెళ్లి గురించి ప్ర‌స్తావిస్తూ.. ఆ వివాహానికి రాణీ ముఖ‌ర్జీ కి ఆహ్వానం అంద‌లేదు, ఎందుకు అంద‌లేదు.. అనే అంశం గురించి చ‌ర్చ మొద‌లుపెట్టి, ఆ ఆహ్వానం అంద‌క‌పోవ‌డం గురించి రాణీ స్పందించిన తీరునూ ప్ర‌స్తావించి, అప్ప‌ట్లో ఇలా జ‌రిగింది తెలుసా అంటూ ఇప్ప‌టి సినీ ప్రేక్ష‌కుల‌కు జ్ఞాన‌బోధ చేస్తోంది బాలీవుడ్ మీడియా!

ఇంత‌కీ ఈ క‌థేమిటంటే.. అప్ప‌ట్లో అభిషేక్ బ‌చ్చ‌న్- రాణీ ముఖ‌ర్జీలు ప‌లు సినిమాల్లో క‌లిసి న‌టించారు. వీరిద్ద‌రి మ‌ధ్య‌నే ఏదో న‌డుస్తోంద‌నే గాసిప్పులూ వ‌చ్చాయి. అంత‌లోనే ఐశ్వ‌ర్య‌రాయ్- అభిషేక్ ల ప్రేమ‌, పెళ్లి. మ‌రోవైపు రాణీ కూడా బాలీవుడ్ లో బ‌డా నిర్మాత‌తోనే ఎఫైర్ న‌డుపుతూ ఉండేద‌ప్ప‌ట్లో, త‌ర్వాత అత‌డినే పెళ్లి చేసుకుంది. అయితే రాణీ అంటే ఐశ్వ‌ర్య‌రాయ్ కు అస్స‌లు ప‌డేది కాద‌ట‌! 

దానికి కార‌ణం.. అప్ప‌టికే అభిషేక్ తో స‌న్నిహితంగా ఉంటుంద‌నడంతో పాటు, చ‌ల్తే చ‌ల్తే సినిమాలో త‌న‌కు ద‌క్కిన అవ‌కాశాన్ని రాణీ త‌న్నుకుపోయింద‌ని ఐశ్వ‌ర్య‌కు కోప‌మ‌ట‌. అందుకే ఆమె త‌న పెళ్లికి ఈ న‌టీమ‌ణిని అస్స‌లు ఆహ్వానించ‌లేద‌ట‌. ఐష్ పిల‌క‌పోతే పోయింది, క‌నీసం అభిషేక్ కూడా పిల‌వ‌లేదు ఎందుకు? అంటే.. బహుశా అత‌డికి పెళ్లికి ముందే  ఐష్ హెచ్చ‌రిక ఏమైనా జారీ చేసిందేమో! అనే ఊహాగానాలున్నాయి.

అయితే ఈ విష‌యంలో రాణీ మాత్రం హుందాగా స్పందించింది. వాళ్ల పెళ్లికి బాలీవుడ్ లోని త‌క్కిన వారంద‌రినీ పిలిచి త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డం వారి వ్య‌క్తిగ‌తం అని, అందులో తను ఆలోచించేదేమీ లేద‌ని రాణీ స్ప‌ష్టం చేసింది గ‌తంలోనే. అభిషేక్ త‌నకు మ‌రీ అంత దోస్త్ ఏమీ కాద‌ని, అత‌డితో కలిసి కొన్ని సినిమాల్లో ప‌ని చేసినా, అత‌డితో త‌న ప‌రిచ‌యం కో వ‌ర్క‌ర్ గానే అని రాణీ వ్యాఖ్యానించింది. అయినా.. అభిషేక్- ఐశ్వ‌ర్య‌ల పెళ్లికి హాజ‌రు కాని వాళ్లు మ‌రింత మంది ఉన్నారు క‌దా, ది గ్రేట్ స‌ల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ లాంటి బాలీవుడ్ జ‌నాలు కూడా అభి-ఐష్ ల పెళ్లి కి దూరందూర‌మే క‌దా!

శభాష్ జగన్ జీ.. మీ చర్యలు భేష్