ప్రతిభ, పరిశ్రమకు పట్టం.. కేశిరెడ్డికి పదవి!

రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారుగా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డిని నియమిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కేశిరెడ్డికి పదవి అనేది ఐటీ రంగంలో సదీర్ఘకాలంగా ఆయన సాధించిన పరిణతి, కనబరచిన ప్రతిభలకు తగిన గుర్తింపు…

రాష్ట్రప్రభుత్వ ఐటీ సలహాదారుగా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డిని నియమిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కేశిరెడ్డికి పదవి అనేది ఐటీ రంగంలో సదీర్ఘకాలంగా ఆయన సాధించిన పరిణతి, కనబరచిన ప్రతిభలకు తగిన గుర్తింపు అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి చాన్నాళ్లుగా అభిమానిగా ఉంటూ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలకు ఫలితంగానే ఇవాళ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఆయనకు పదవి లభించింది.

కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో అమెరికాలో ఉంటూ.. తాను విపరీతంగా అభిమానించే నాయకుడు జగన్మోహన రెడ్డి కోసం తన వ్యాపారాలను తృణప్రాయంగా వదులుకుని వచ్చారు. జగన్ మీద అభిమానంతో పార్టీకి సేవలందించడానికి ఆయన పూర్తి సమయం కేటాయించారు.

ఐప్యాక్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రధానంగా పార్టీకి ఆయువుపట్టు వంటి బూత్ కమిటీల ఏర్పాటు వాటి సమన్వయం విషయంలో కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన కృషి పార్టీకి ఎంతగానో ఉపకరించింది. ఆధునిక సాంకేతిక విప్లవాన్ని కూడా జోడిస్తూ.. బూత్ కమిటీలతో పార్టీ కోఆర్డినేషన్ లో కేశిరెడ్డి కొన్ని సంవత్సరాలుగా కీలక భూమిక పోషించారు. ఎన్నికల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43వేల పైచిలుకు బూత్ కమిటీలతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన వ్యవస్థాగత నిర్మాణంగా రూపుదిద్దుకున్నదంటే.. అందులో కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి కృషి, పరిశ్రమ ఎంతో ఉంది.

అలాగే.. తెలుగుదేశం పార్టీనుంచి అనేక మంది నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరడంలోనూ, ఆరకంగా పార్టీ తిరుగులేని బలాన్ని సంతరించుకోవడంలోనూ రాజశేఖర రెడ్డి సంధానకర్తలాగా పనిచేశారు. ఒకవైపు వైఎస్ జగన్మోహనరెడ్డి గారి మార్గదర్శకత్వంలో.. ఆయన సూచనల మేరకు, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి సలహాలు, సూచలను పాటిస్తూ, అమల్లో పెడుతూ.. బూత్ కమిటీలను పార్టీకి సంబంధించిన సమస్త అనుబంధ విభాగాలను పటిష్టంగా రూపుదిద్దడంలో కేశిరెడ్డి పనిచేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఐటీ సలహాదారుగా పదవిని ఇవ్వడంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిగారు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, బాధ్యతలకు న్యాయం చేస్తానని కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?