ఆర్.ఆర్.ఆర్ ఒరిజినల్ డేట్‌కి రిబ్బన్ కట్?

'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి రాజమౌళి ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ జులై 30. ఆ డేట్‌కి ట్రిపులార్ రావడం లేదు కానీ తెలుగు సినిమా పనులు మళ్లీ యధావిధిగా అప్పట్నుంచి మొదలవుతాయనే సంకేతాలు అందుతున్నాయి. Advertisement సినిమా…

'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి రాజమౌళి ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ జులై 30. ఆ డేట్‌కి ట్రిపులార్ రావడం లేదు కానీ తెలుగు సినిమా పనులు మళ్లీ యధావిధిగా అప్పట్నుంచి మొదలవుతాయనే సంకేతాలు అందుతున్నాయి.

సినిమా షూటింగ్స్‌కి జూన్ నుంచి పర్మిషన్ లభిస్తుందనే ఆశాభావంతో నిర్మాతలున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ చేయడానికి మాత్రం జులై వరకు ఆగవచ్చునని అనుకుంటున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా సినిమా థియేటర్లు మొదలయితే తప్ప పెద్ద సినిమాలు విడుదల చేసుకోవడానికి లేదు.

ఓవర్సీస్ రిలీజ్‌తో పని లేని చిన్న సినిమాలని జులై మొదటి మూడు వారాలలో విడుదల చేసుకోవచ్చునని, వి, రెడ్ లాంటి చిత్రాలను మాత్రం జులై 30 నుంచి షెడ్యూల్ చేయవచ్చునని చూచాయగా అనుకున్నారట. ఇంకా ఎవరు, ఎప్పుడు వచ్చేదీ డిసైడ్ కాలేదు. 

కాకపోతే విడుదల చేయడమే ఎక్కువ బిజినెస్ జరగాల్సిన సినిమాలను కాకుండా పబ్లిక్‌ని మళ్లీ థియేటర్ల వైపు నడిపించడానికి స్లో అండ్ స్టడీ సూత్రాన్ని టాలీవుడ్ అమలు చేయనుంది.

అందుతున్న సంకేతాలని బట్టి ఆగస్ట్ నుంచి మళ్లీ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలకి ఆస్కారముంది.