వీర్యంలో కరోనా.. సెక్స్ క్వారంటైన్ తప్పనిసరి

కరోనా (కోవిడ్-19)కు సంబంధించి ఓవైపు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు ఎంత ముమ్మరంగా సాగుతున్నాయో, మరోవైపు కరోనా వ్యాప్తికి సంబంధించిన ప్రయోగాలు కూడా అంతే చురుగ్గా సాగుతున్నాయి. కరోనా ఎలా వ్యాపిస్తుంది.. ఏఏ ఉపరితలాలపై ఎన్ని…

కరోనా (కోవిడ్-19)కు సంబంధించి ఓవైపు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు ఎంత ముమ్మరంగా సాగుతున్నాయో, మరోవైపు కరోనా వ్యాప్తికి సంబంధించిన ప్రయోగాలు కూడా అంతే చురుగ్గా సాగుతున్నాయి. కరోనా ఎలా వ్యాపిస్తుంది.. ఏఏ ఉపరితలాలపై ఎన్ని గంటల పాటు ఉంటుందనే అంశాలకు సంబంధించి ఇప్పటికే పరిశోధకులు కొన్ని నివేదికలు తయారుచేశారు. తాజాగా శృంగారానికి సంబంధించిన నివేదిక కూడా వచ్చింది.

చైనా-అమెరికా సైంటిస్టులు నిర్వహించిన పరీక్షల్లో వీర్యకణాల్లో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. చైనాలోని షాంగిక్యూ హాస్పిటల్ లో కరోనాతో బాధపడుతున్న 38 మంది నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించగా వాళ్ల వీర్యంలో కోవిడ్-19 వైరస్ ను గుర్తించారు.

అయితే వీర్యంలో కరోనా ఎన్ని రోజులు ఉంటుంది.. సెక్స్ చేస్తే సదరు మహిళకు కూడా కరోనా వస్తుందా అనే అంశాలపై మాత్రం ఇంకా పరిశోధన కొనసాగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తుల వీర్యంలో వైరస్ లేదని గుర్తించారు వైద్యులు.

ప్రస్తుతానికైతే ఈ దిశగా ప్రయోగాలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి కాబట్టి కరోనా సోకిన వ్యక్తి  ముందు జాగ్రత్తగా 2 వారాల పాటు సెక్స్ కు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా ప్రధానంగా దగ్గు, తుమ్ము ద్వారా మాత్రమే వ్యాపిస్తుందనేది సైంటిస్టులు తేల్చారు. మరోవైపు రక్తం, కన్నీళ్ల ద్వారా వ్యాపిస్తుందని గుర్తించారు. సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

అప్పటి నిజాలు బయటపెట్టిన కొడాలి నాని