పాడేరుకు ఓబెరాయ్ గ్రూప్స్ ….?

దేశంలోనే ఆతిధ్య రంగంలో ప్రఖ్యాతమైన స్థానాన్ని అందుకున్న వారు ఓబెరాయ్ గ్రూప్స్. ఆ సంస్థలకు హొటల్ రంగంలో ఉత్తమమైన ప్లేస్ ఉంది. అలాంటి  ఓబెరాయ్ గ్రూప్స్ ఇపుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఏపీలో విశాఖపట్నం…

దేశంలోనే ఆతిధ్య రంగంలో ప్రఖ్యాతమైన స్థానాన్ని అందుకున్న వారు ఓబెరాయ్ గ్రూప్స్. ఆ సంస్థలకు హొటల్ రంగంలో ఉత్తమమైన ప్లేస్ ఉంది. అలాంటి  ఓబెరాయ్ గ్రూప్స్ ఇపుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఏపీలో విశాఖపట్నం సిటీతో పాటు తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్ లో హోటల్స్‌ ఏర్పాటుచేసేందుకు ఉత్సాహపడుతున్నాయి.

ఈ నేపధ్యంలో మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ఇపుడు బయటకు వచ్చింది. అదేంటి అంటే కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో కూడా ఓబెరాయ్ గ్రూప్స్ అడుగుపెడుతున్నాయని. పాడేరు అంటే టూరిజానికి మారు పేరు.

అయితే ఇక్కడ ప్రకృతి సంపదను ప్రపంచానికి చూపించి దాంతో అక్కడ జనాలకు ఉపాధి కల్పించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. టూరిజాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానం ద్వారా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన.  ఈ నేపధ్యంలో ఓబెరాయ్ గ్రూప్స్ పాడేరులో ఎంటర్ కాబోతున్నాయని తెలుస్తోంది.

అక్కడ టూరిజం సెంటర్ ని ఈ ప్రఖ్యాత సంస్థ డెవలప్ చేయడానికి కార్యాచరణను సిద్ధం చేస్తోంది అంటున్నారు. దాంతో పాడేరు గిరిసీమల దశ తిరిగినట్లే అంటున్నారు. ఇప్పటిదాకా మెగాసిటీలలోనే పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఓబెరాయ్ లాంటి బిగ్ గ్రూపు ఏజెన్సీ రూట్ పట్టడం అంటే ఒక విధంగా గిరిసీమలకు మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.