వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఓటీటీకి చేరిందా?

పెళ్లిళ్లను ఓటీటీలకు అమ్ముకోవడం ఈమధ్య ఫ్యాషన్ గా మారింది. సదరు సెలబ్రిటీలు ఈ వివాహ స్ట్రీమింగ్ హక్కుల్ని విక్రయించేందుకు భారీగా డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు కూడా. మొన్నటికిమొన్న నయనతార పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది.…

పెళ్లిళ్లను ఓటీటీలకు అమ్ముకోవడం ఈమధ్య ఫ్యాషన్ గా మారింది. సదరు సెలబ్రిటీలు ఈ వివాహ స్ట్రీమింగ్ హక్కుల్ని విక్రయించేందుకు భారీగా డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు కూడా. మొన్నటికిమొన్న నయనతార పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లి కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని సంప్రదించిందంట. ఏకంగా 8 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందట. వెంటనే ఈ జంట తమ పెళ్లి స్ట్రీమింగ్ కు అంగీకరించినట్టు వార్తలొచ్చాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది మెగా కాంపౌండ్. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే ఆనంద క్షణాల్ని ఓటీటీలో పెట్టే ఆలోచన ఈ జంటకు అస్సలు లేదని తెలిపింది. అది పూర్తిగా కాంపౌండ్ కు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమని, వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకున్నామనే వార్తల్లో నిజం లేదని, వరుణ్ తేజ్ తరఫు వ్యక్తులు క్లారిటీ ఇచ్చారు.

ఇటలీలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు వరుణ్ తేజ్-లావణ్య. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చి సినీ ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు. త్వరలోనే లావణ్య త్రిపాఠి స్వస్థలమైన డెహ్రాడూన్ లో కూడా ఓ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.