గుంటూరు కారం సాంగ్.. ఆ పదాలన్నీ త్రివిక్రమ్ వే

ఎట్టకేలకు మహేష్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. గుంటూరుకారం నుంచి మొట్టమొదటి సింగిల్ రిలీజైంది. దమ్ మసాలా పేరిట రిలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోగా నిలిచింది. Advertisement త్రివిక్రమ్ సాయంతో…

ఎట్టకేలకు మహేష్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. గుంటూరుకారం నుంచి మొట్టమొదటి సింగిల్ రిలీజైంది. దమ్ మసాలా పేరిట రిలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోగా నిలిచింది.

త్రివిక్రమ్ సాయంతో తమన్ మరోసారి పెప్పీ సాంగ్ కంపోజ్ చేశాడు. అయితే ఈసారి త్రివిక్రమ్, కేవలం తమన్ కు మాత్రమే కాదు, గీత రచయిత రామజోగయ్య శాస్త్రికి కూడా మాట సాయం అందించాడు.

దమ్ మసాలా సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అయితే ఈ పాటలో ఉన్న ర్యాప్ వెర్షన్ కు త్రివిక్రమ్ సాహిత్యం సమకూర్చాడు. దీనికి ముద్దుగా స్పైస్ ర్యాప్ అని పేరు పెట్టుకున్నారు. పాటను సుజీత్ హెగ్డేతో కలిసి తమన్ ఆలపించగా.. త్రివిక్రమ్ రాసిన పదాల స్పైసీ ర్యాప్ వెర్షన్ ను హేమచంద్ర, విక్కీ సంయుక్తంగా ఆలపించారు.

త్రివిక్రమ్ తో సంగీత చర్చల్లో కూర్చుంటే, అటు రచయితతో పాటు, ఇటు సంగీత దర్శకుడికి కూడా చాలా పని తగ్గుతుంది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో తమన్ స్వయంగా వెల్లడించాడు. ఈరోజు రిలీజైన గుంటూరు కారం సాంగ్ లో కూడా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రామజోగయ్య రచన కంటే, త్రివిక్రమ్ భావుకతే ఎక్కువగా సాహిత్యంలో కనిపిస్తోంది.

మొత్తానికి గుంటూరుకారం ప్రమోషన్లు మొదలయ్యాయి. రిలీజ్ డేట్ పై సందిగ్దత కూడా వీడింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తున్నాడు మహేష్ బాబు.