చంద్రబాబు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి పెద్ది రెడ్డి స్పందించారు. 33 ఏళ్లు పాటు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కుప్పనికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏదైనా ఎక్కడైనా అభివృద్థి చేసుంటే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు.
కుప్పంలో చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఎలాగైనా దౌర్జన్యాలతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని.. ఇంకా చంద్రబాబు ఆటలు సాగవని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని మంత్రి పెద్దిరెడ్డి సృష్టం చేశారు. ఎప్పుడు చంద్రబాబు కుప్పంకు వచ్చిన ఆ రోజు బ్లాక్ డే అవుతుందన్నారు. ఇంకా కుప్పంలో చంద్రబాబు గెలిచేది కేవలం కలలో మాత్రమేనని అన్నారు.
చంద్రబాబు, తన పార్టీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేసి మళ్లీ వైసీపీ పార్టీపై బురద చల్లుతున్నరని ఆరోపించారు. రాజకీయాల్లో తన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఒక శుంట చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలోనే పనికిమాలిన రాజకీయ నాయకుడు చంద్రబాబే అంటూ విమర్శించారు.
టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే తాము చూస్తూ ఊరుకునేది లేదని.. ఇప్పటికి అయినా రెచ్చగోట్టడం మానుకోవాలని లేకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లలో గెలిచేది వైసీపీనే అంటూ జోస్యం చెప్పారు. తాన హాయంలో అభివృధి చేయకుండా ఇప్పుడు అభివృధి చేస్తుంటే అడ్డుకుంటున్నారాని మండిపడ్డారు.