తెలంగాణలో కమ్మ వాళ్ల జనాభా ఎంతుండొచ్చు? అధికారిక లెక్కలు లేవు కానీ, ఉమ్మడి ఏపీలోనే కమ్మ వాళ్ల జనాభా గట్టిగా ఐదారు శాతాన్ని మించకపోవచ్చు! మరి తెలంగాణలో అయితే అది మరింత తక్కువ! అయితే.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే అది తమ ఘనతగా చెప్పుకోవడానికి కమ్మవాళ్లు తాపత్రయపడుతూ ఉండటం గమనార్హం!
వీరికి బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద కోపం వచ్చిందట! కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే.. అదంతా నిస్సందేహంగా తమ ఘనతే అని కమ్మ వాళ్లు సోషల్ మీడియా వేదికగా తొడలు కొడుతూ ఉండటం గమనార్హం!
మరి నిజంగా కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో, కాంగ్రెస్ మీద ఇన్నాళ్లకు ఏర్పడిన సానుకూలతతోనో, ఆ పార్టీ హామీలు వర్కవుట్ అయ్యో, మరోటి జరిగో ఆ పార్టీకి మినిమం మెజారిటీ దక్కినా.. అది తమ విజయంగానే కమ్మ బ్యాచ్ చెప్పుకోవడాన్ని ఇప్పుడే మొదలుపెట్టింది!
తెలంగాణలో ఏ ప్రభుత్వం అయినా ప్రజావ్యతిరేకతకు మినహాయింపు కాదు. ఏ ప్రభుత్వం మీద అయినా ఐదేళ్లలోనే వ్యతిరేకత రావడం సహజమైన ప్రాంతం అది. ఇలాంటి చోట పదేళ్లుగా కేసీఆర్ బండి నడిపిస్తున్నారంటే అది తెలంగాణ తీసుకొచ్చిన నేతగా కేసీఆర్ తెచ్చుకున్న ఇమేజ్. మరి దానికైనా ఒక హద్దు ఉంటుందని తెలంగాణ ప్రజలు అనుకుంటే.. ఆయనను ఓడించనూ వచ్చు!
మరి ఊపేకుహా లాగా.. కొందరు సోషల్ మీడియాకు ఎక్కి, కమ్మోళ్లకు కోపం వచ్చింది కేసీఆర్ ఓడిపోతే అది కమ్మోళ్ల ఆగ్రహ ఫలితమే తప్ప తెలంగాణలో మరో రాజకీయ సమీకరణమే లేదన్నట్టుగా కూకట్ పల్లి బ్యాచ్ చెప్పుకుంటూ ఉండటం గమనార్హం!
కూకట్ పల్లి, శేర్ లింగం పల్లి మాటలే మొత్తం తెలంగాణ రాజకీయం అన్నట్టుగా వీరి ప్రగల్బాలు సాగుతున్నాయి. మరి వీరి ఆనందం మాటేమిటో కానీ.. కాంగ్రెస్ గెలిస్తే అది కమ్మ రాజ్యమే అనేంత స్థాయిలో వీరి ప్రగల్బాలు ఆ పార్టీకి వీలైనంత చేటు చేసే అవకాశాలను పుష్కలంగా ఇస్తున్నాయి!