కాస్త లేటుగా తెల్లారినట్లుంది మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కి. ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సింది పోయి.. విదేశాల్లో సకుటుంబ సమేతంగా విహరిస్తోన్న నారా లోకేష్, అంత బిజీలోనూ కొంత తీరిక చేసుకుని ట్వీట్లేయడం మొదలెట్టినట్టున్నారు ట్వీటేషుగారు. అయితే, ఆ ట్వీట్ల కారణంగా నెటిజన్ల 'పోట్లు'ని కూడా గట్టిగానే ఎదుర్కోవాల్సి వస్తోంది నారా లోకేష్‌కి.
తాజాగా, నారాలోకేష్ పోస్ట్ చేసిన ట్వీట్‌కి నెటిజన్లు ఓ రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల ఒంగోలులో ఓ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై నారా లోకేష్ విచారం వ్యక్తం చేస్తూ తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ట్వీటేశారు. అక్కడితో ఆగలేదాయన. ఆ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తేనని సెలవిచ్చారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేశారీ చినబాబు.
పాదయాత్ర సందర్భంగా చాలామందిని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కలిశారు. ఈ క్రమంలో కొందరితో సెల్ఫీలు దిగారు కూడా. అయితే, వాటిల్లోంచి ఓ ఫొటోని పెర్ఫెక్ట్గా సెలక్ట్ చేసి ఎవరో మార్ఫింగ్ చేసి, నిందితుడి ఫొటోని జగన్ ఫొటోతో జాయిన్ చేశారు. దాన్ని కాస్త టీడీపీ అను'కూల' మీడియా వైరల్ చేసేసింది. ఇకనేం, చినబాబు ఆగుతాడా.? కాస్త ఆలస్యంగానైనా ఆ అంశాన్ని పట్టుకుని వైఎస్ జగన్ మీద బురద జల్లడం షురూ చేశారు.
నిజానికి ఇలాంటి ట్రిక్స్ టీడీపీకి కొత్తేమీకాదు. వైఎస్ జగన్ మీద విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే, నిందితుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.. పైగా, జగన్ అభిమాని.. అంటూ నమ్మించేందుకు అప్పట్లో చంద్రబాబు సర్కార్ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయినా, జరిగిన అత్యాచార ఘటన ఎవడు చేస్తే ఏంటి.? ఖండించి తీరాల్సిందే ఎవరైనా. ఇలాంటి ఘటనల్ని పట్టుకుని పార్టీలకు ఆపాదించి.. రాజకీయాలు చేయడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.
ఇలాంటి రాజకీయాల దెబ్బకే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఆంధ్రప్రదేశ్‌లోనూ గల్లంతయిపోయే ప్రమాదంలో పడింది మరి. మరోపక్క, 'మీ ఆణిముత్యాలివిగో..' అంటూ టీడీపీ నేతలపై వున్న కేసుల గురించీ.. మహిళలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించీ.. నెటిజన్లు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు.