శ్రీదేవికి గూగుల్ నివాళి

గూగుల్ డూడుల్ లో ప్రత్యక్షమైంది అతిలోకసుందరి శ్రీదేవి. ఈరోజు ఆమె 60వ జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్ తయారుచేసి, తన హోం పేజీలో పెట్టింది గూగుల్. చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు…

గూగుల్ డూడుల్ లో ప్రత్యక్షమైంది అతిలోకసుందరి శ్రీదేవి. ఈరోజు ఆమె 60వ జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్ తయారుచేసి, తన హోం పేజీలో పెట్టింది గూగుల్. చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు శ్రీదేవి గొప్పదనాన్ని డూడుల్ లో అద్భుతంగా ఆవిష్కరించారు.

తన డాన్స్ తో ఇండియా మొత్తాన్ని మెస్మరైజ్ చేశారు శ్రీదేవి. అందుకే ఆమె డాన్సింగ్ పోజునే డూడుల్ లో పెట్టారు. పైగా దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన నాగిని సింబల్ ను కూడా అందులో పొందుపరిచారు.

రెట్రో స్టయిల్ లో తయారుచేసిన ఈ డూడుల్ తో శ్రీదేవికి ఘనంగా నివాళులు అర్పించింది గూగుల్. కాలంతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో అత్యంత ప్రభావవంతమైన హీరోయిన్లలో శ్రీదేవి ఒకరంటూ అతిలోకసుందర్ని కొనియాడింది గూగుల్.

1963 సంవత్సరం సరిగ్గా ఇదే రోజున జన్మించిన శ్రీదేవి, బాలనటిగా తన కెరీర్ ప్రారంభించారు. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. తమిళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించి, సౌత్ అంతటా పాపులర్ హీరోయిన్ అనిపించుకున్నారు.

సౌత్ లో తనదైన ముద్రవేసిన శ్రీదేవి, ఆ తర్వాత బాలీవుడ్ లోకి కూడా ఎంటరయ్యారు. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. హీరోతో సంబధం లేకుండా, శ్రీదేవి కోసం అప్పట్లో ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు.

తన కెరీర్ లో ఇండియాలోని దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు శ్రీదేవి. ఏఎన్నార్ తో ఎన్నో సూపర్ హిట్స్ లో నటించిన ఈ అతిలోక సుందరి, ఆ తర్వాత ఏఎన్నార్ తనయుడు నాగార్జునతో కూడా నటించారు. ఓ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి, అక్కడి హోటల్ లోని బాత్ టబ్ లో అనుమానాస్పదంగా మృతిచెందారు.