తెలుగుదేశం పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగానే చంద్రబాబు ఉంటున్నారు. పార్టీ పెట్టిన ఎన్టీయార్ కేవలం 14 ఏళ్ళ పాటే ప్రెసిడెంట్ గా ఉండగలిగారు. దానికి రెట్టింపు చంద్రబాబు టీడీపీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. తన తరువాత కుమారుడు లోకేష్ ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అని అంటారు.
తెలుగుదేశం పార్టీలో ఇపుడు నాయకత్వ సంక్షోభం ఉందా అంటే ఉందనే జూనియర్ ఎంట్రీ ఇచ్చారా అన్న డౌట్లు వస్తున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ పెద్ద అమిత్ షా తో జూనియర్ భేటీ వెనక పక్కా రాజకీయ వ్యూహమే ఉందని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేదన బీజేపీ వారు జూనియర్ తో మాట కలిపారు అని టీటీడీ చైర్మన్, జగన్ బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి అసక్తికరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రజలలో విశ్వాసం కోల్పోయాడు అని బీజేపీ గట్టి నిర్ణయానికి వచ్చిదని ఆయన అంటున్నారు.
తమ పార్టీలో సరైన నాయకత్వం ఉందా లేదా అన్నది టీడీపీ వారే ఆలోచించుకోవాల్సి ఉంటుందని అన్నారు. చంద్రబాబు తరువాత టీడీపీ సారధి జూనియర్ అని చెప్పాలన్నదే బీజేపీ ప్రయత్నంగా ఉందని కూడా వైవీ చెబుతున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేనంత మాత్రాన ఏపీలో వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రాకుండా పోతుందా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది రాష్ట్ర ప్రజలని, వారు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ తామే ఏపీలో అధికారంలోకి వస్తామని ఆన ధీమాగా చెబుతున్నారు.