స్క్రిప్ట్ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు హర్షవర్థన్. అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ ల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు అర్జెంట్ గా ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు.
హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో హీరో. ఆసియన్ సినిమాస్ సంస్థ నిర్మాత. ఓ డిఫరెంట్ ఫన్ ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
సుధీర్ బాబు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు షూట్ లో వున్నాయి. ఒకటి ఇంద్రగంటి డైరక్షన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి…రెండోది కరుణ్ కుమార్ డైరక్షన్ లో శ్రీదేవి సోడా సెంటర్. ఇవి కాక పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి వుండనే వుంది.
ఆసియన్ సినిమాస్ సంస్థ ఇప్పటికే లవ్ స్టోరీ, లక్ష్య సినిమాలు పూర్తి చేసింది. ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో అలాగే శివకార్తికేయన్-అనుదీప్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో వున్నాయి.